-
బొమ్మకు ధగధగ మెరిసెడు
సొమ్ములు దట్టించి పెట్ట సోకుకు, ముద్దుం
గుమ్మలు ముట్టన్ పైబడి
కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘలు ఘలుమనియెన్!
-
కుమ్మెను నిర్భయ పులిచం
దమ్మున కామాంధునికడు ధైర్యముతోడన్
గ్రమ్మిన మైకము తొలగన్
కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘలు ఘలుమనియెన్!
(శంకరాభరణం బ్లాగులో 24-06-2013 నాటి సమస్యా పూరణ- 1092 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment