Sunday, October 30, 2011

కూర్మి బెంచు సోదరియింట కుడువ!

ప్రేమ తోడుత కడుపార బెట్టి నట్టి
నటుకు లైనను ఫలమైన యమృత మగును 
కూర్మి బెంచు సోదరియింట కుడువ,కాదు 
జనులకు భగినీ హస్త భోజనము విషము !!!
(భగిని = సోదరి)

(శంకరాభరణం  బ్లాగు లో 28-10-2011 నాటి  సమస్యా పూరణ-507 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Saturday, October 29, 2011

ఏనుగు జన్మించె నొక్క యెలుక కడుపునన్ !!!

ఎప్పుడూ యున్నవీ లేనివీ  వార్తలు మోసుకువచ్చి చెప్పే మిత్రుని ఉద్దేశించి మరో మిత్రుడు ఈవిధంగా అన్నాడనినాభావన.

కానగ లేవా జగతిని ?
మానగ లేవా యనృతపు మాటలు బల్కన్ ?
యేనాడెచ్చట? నెట్టుల?
యేనుగు జన్మించె నొక్క యెలుక కడుపునన్ !!! 
 
 
(శంకరాభరణం  బ్లాగు లో 27-10-2011 నాటి  సమస్యా పూరణ-506లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Friday, October 28, 2011

దీపావళి పోరు సలిపె తిమిరము తోడన్!!!

లోపలి సద్గుణ దీపము
కోపాలను రూపుమాపు, కుమతుల మదిలో
దీపాల వెలుగు నింపగ
దీపావళి పోరు సలిపె తిమిరము తోడన్!!! 

(శంకరాభరణం  బ్లాగు లో 26-10-2011 నాటి  సమస్యా పూరణ-505లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Thursday, October 27, 2011

సొమ్ము లున్న వాడె సుగుణ ధనుడు!!!

సత్య భాషణమ్ము సద్గురు సేవన
దైవచింతనమ్ము ధర్మనిరతి
శుభకరమగు నిట్టి శోభాన్వితములైన
సొమ్ము లున్న వాడె సుగుణ ధనుడు!!! 

(శంకరాభరణం  బ్లాగు లో 24-10-2011 నాటి  సమస్యా పూరణ-503 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Wednesday, October 26, 2011

దీపావళి శుభాకాంక్షలు !!!

       దీపావళి శుభాకాంక్షలు 


పిల్లలు నవ్వుల ముల్లెలు,
పిల్లలు చిచ్చర    పిడుగులు  ,ప్రేమపు జల్లుల్,
పిల్లలు తారా జువ్వలు,
పిల్లల నవ్వులు   పుడమికి పెన్నిధి చూడన్ !

నేనే నీవైతి నేమొ ? నీవే నేనో ?

నే నెవరో ? నీవెవరో ?
నేనై నాలోననున్న నేస్తంబెవరో ?
నే నెఱుగన్నేరనుగా !
నేనే నీవైతి నేమొ ? నీవే నేనో ? 

(శంకరాభరణం  బ్లాగు లో 23-10-2011 నాటి  సమస్యా పూరణ-502లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Tuesday, October 25, 2011

మాట దప్పు వాడె మాన్యు డగును!!!

నీతి పాలకుండు నిత్యప్రసన్నుండు
కాటికాపరయ్యె మాటకొఱకు!
పదవి కొఱకు నేడు పలుమాటలను జెప్పి
మాట దప్పు వాడె మాన్యు డగును!!! 

(శంకరాభరణం  బ్లాగు లో 20-10-2011 నాటి  సమస్యా పూరణ-499లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Monday, October 24, 2011

కుంచములో బోతునక్క కూనల బెట్టన్ !!!

వంచన జేయగ పొంచెను
కుంచములో బోతునక్క! కూనల బెట్టన్
చంచలమార్జాలమొకటి
కుంచము మంచముల మధ్య ,కూనలుజచ్చెన్!!!

(శంకరాభరణం  బ్లాగు లో 19-10-2011 నాటి  సమస్యా పూరణ-498లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Sunday, October 23, 2011

గాలి మేడలు స్వర్గమ్ము కన్న మిన్న!!!

నీటి బుడుగల చందమ్ము నీవు గట్టు
గాలి మేడలు !స్వర్గమ్ము కన్న మిన్న
కష్ట పడుటలో నున్నట్టి కమ్మదనము!
తగునె   సోమరి తత్వమ్ము తగదు నీకు!!!

(శంకరాభరణం  బ్లాగు లో 18-10-2011 నాటి  సమస్యా పూరణ-497లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Saturday, October 22, 2011

మా కేనుంగులు సాటియే యనుచు దోమల్ పల్కుటల్ చిత్రమే?

ప్రాకారంబులు,మేడ మిద్దెలవి,యాపై తాటిలోగిళ్ళలో
నేకాలంబులనైన మాకు గలవే, యేచిన్ని యాటoకముల్,
మాకింకెవ్వరుగారు పోటి,దిరుగన్,మావల్లనే "డెంగ్యు" యున్
మా కేనుంగులు సాటియే యనుచు దోమల్ పల్కుటల్ చిత్రమే? 

(శంకరాభరణం  బ్లాగు లో 16-10-2011 నాటి వారాంతపు   సమస్యా పూరణ-494లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

జ్ఞానము లేనట్టి వాఁడు సద్గురు వయ్యెన్!!!

ఏనాటి పుణ్య ఫలమో,
మానోములుపండెనేమొమాన్యుడు,సాయీ
గానవదాన్యుడు,చెడువి
జ్ఞానము లేనట్టి వాఁడు సద్గురు వయ్యెన్!!!

(శంకరాభరణం  బ్లాగు లో 16-10-2011 నాటి  సమస్యా పూరణ-495లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Friday, October 21, 2011

పరమ పావనమ్ము పరులసొమ్ము!!!

పరమ పావనమ్ము పరులసొమ్ములరక్ష
పరుల హింస తగని పాతకమ్ము
ఉత్తమమ్ముసుమ్ము నుర్విజనులసేవ
నమ్ము,సేవ జేయ రమ్ము లెమ్ము!!!

(శంకరాభరణం  బ్లాగు లో 15-10-2011 నాటి  సమస్యా పూరణ-493లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Thursday, October 20, 2011

దామోదరు దిట్టు వాఁడెధనవంతుఁడగున్ !

కామము క్రోధము మోహము
నేమమ్మునవీడినట్టి నిర్మలచిత్తుం
డేమని సర్వేశ్వరుడగు
దామోదరు దిట్టు? వాఁడెధనవంతుఁడగున్ ! 

(శంకరాభరణం  బ్లాగు లో 14-10-2011 నాటి  సమస్యా పూరణ-492లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Wednesday, October 19, 2011

ద్రోణ సుతుడు పాండవులకు ప్రాణసఖుడు !!!

ద్రోణ సుతుడు పాండవులకు ప్రాణసఖుడు
కాడు,కాని హితవుబల్కె కౌరవులకు
పోరునష్టంబు ,లాభంబుపొందు, గాన
సంధికొప్పుటే కురువంశ సౌఖ్యమనెను!!!

(శంకరాభరణం  బ్లాగు లో 13-10-2011 నాటి  సమస్యా పూరణ-491లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Tuesday, October 18, 2011

దొరకక తప్పించు కొన్న దొంగలు దొరలే ,

దొరికిన వారే దొంగలు
దొరకక తప్పించు కొన్న దొంగలు దొరలే ,
దొరికినను దొరకకున్నను
దొరకని దొరలును దొరికిన దొంగలునొకటే! 

(శంకరాభరణం  బ్లాగు లో 17-10-2011 నాటి  సమస్యా పూరణ-496లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Monday, October 17, 2011

రాతికి పుత్త్రుండు పుట్టె రాజీవాక్షీ!

ఆ తిరుమలరాయని తా
నేతీరుగ వేడెనేమొ యెదనల్లాడన్
ప్రీతిగ మ్రొక్కెను దివ్యపు
రాతికి, పుత్త్రుండు పుట్టె రాజీవాక్షీ! 

(శంకరాభరణం  బ్లాగు లో 12-10-2011 నాటి  సమస్యా పూరణ-490లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Sunday, October 16, 2011

పువ్వు లోన రెండు పువ్వు లమరె!!!

ముదిత ముద్దు మోము ముద్దమందారమ్ము
చిరు గులాబి పూలు చెంపలందు
నారి నవ్వు లొలుకు నడిచేటి పువ్వురా
పువ్వు లోన రెండు పువ్వు లమరె!!! 

(శంకరాభరణం  బ్లాగు లో 11-10-2011 నాటి  సమస్యా పూరణ-489లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Saturday, October 15, 2011

భగవ దారాధనము జేసి పతితుడయ్యె!!!

నీతి ధర్మమ్ము విడనాడి ప్రీతిగాని
చేటు పనులన్నిజేసిన చేతి తోడ
భగవ దారాధనము జేసి పతితుడయ్యె
గాలి! ఫలితమ్ము జైలులో గడుపుటయ్యె !!!


(శంకరాభరణం  బ్లాగు లో 10-10-2011 నాటి  సమస్యా పూరణ-488లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Friday, October 14, 2011

ఆదరింపవలదు పేదజనుల!!!

ఆదరింపవలదు నాడంబరముజూసి,
ఆదరింపవలదు ఆస్తిజూసి,
ఆదరింపవలదు పేదజనులజూసి
చీదరించుకొనెడు చేదుమతుల !!!


(శంకరాభరణం  బ్లాగు లో09-10-2011 నాటి  సమస్యా పూరణ-487లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Thursday, October 13, 2011

సిరిమగనింగాంచి చంద్రశేఖరుఁ డడలెన్!!!

సిరికింజెప్పక పరుగిడి
కరిరాజునిగాచినట్టి కరుణామయుడే
తరుణీ రూపము దాల్చగ
సిరిమగనింగాంచి చంద్రశేఖరుఁ డడలెన్!!! 

(శంకరాభరణం  బ్లాగు లో07-10-2011 నాటి  సమస్యా పూరణ-485లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Wednesday, October 12, 2011

ద్వాదశి తిథి మంచి దగును దసరా చేయన్ !

కాదందురు కొందరుమరి
ద్వాదశితిథిమంచి! దగును దసరా చేయ
న్నీదశమినాడు, జూడగ
నాదశమియె  నేడువచ్చె నాశ్వీజమునన్!!!

(శంకరాభరణం  బ్లాగు లో06-10-2011 నాటి  సమస్యా పూరణ-484లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Tuesday, October 11, 2011

దుర్గా భర్గులను గొలువ దురితములంటున్!

స్వర్గమ్మగుజీవితములు
దుర్గా భర్గులను గొలువ!!! దురితములంటు
న్మార్గమధర్మమ్మైనను,
వర్గాలుగమార్చి జనుల వైరముబెంచన్!


(శంకరాభరణం  బ్లాగు లో03-10-2011 నాటి  సమస్యా పూరణ-481లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Monday, October 10, 2011

అలుక విభూషణము సుజనులగువారలకున్!!!

"పలక" బడిలోబుడుతలకు,
"గిలక" పెరటి బావులకును, గెలచెట్టులకున్
"పిలక" తలకు దుష్టులపై
"నలుక" విభూషణము సుజనులగువారలకున్!!! 

చిలుకకు తీయని పలుకులు,
నెలతకు వలపుల తలపులు ,నేతకు చేతల్
కులుకులు నెమిలికి నెయ్యపు
టలుక విభూషణము సుజనులగువారలకున్!!!

(శంకరాభరణం  బ్లాగు లో03-10-2011 నాటి  సమస్యా పూరణ-481లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Sunday, October 9, 2011

మాయజేయు ఘనుండె గాంధేయవాది!!!

గాంధి పుట్టిన నేలలో గలరునేడు
దేశ సంపద మ్రింగెడు వేశ గాండ్రు
సత్య మునకెల్ల మసిబూసి సకల సిరుల
మాయజేయు ఘనుండె గాంధేయవాది!!! 


(శంకరాభరణం  బ్లాగు లో02-10-2011 నాటి  సమస్యా పూరణ-479లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Saturday, October 8, 2011

కుట్టనిచోతేలుకాదు కుమ్మరిపురుగే!!!

ముట్టినను వేలునెక్కడ
కుట్టనిచోతేలుకాదు కుమ్మరిపురుగే,
ముట్టకుమద్దానిని,చూ
పెట్టుము పెద్దలకుదాని  వివరము దెలియున్ !


(శంకరాభరణం  బ్లాగు లో01-10-2011 నాటి  సమస్యా పూరణ-478లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Friday, October 7, 2011

మానినీమణి భర్తనే మఱచి పోయె!!!

పిల్లలనుజేర్చె లలితాంగి పెద్ద బడిన
వత్సరాంతమ్మువరకును వారురారు,
జేరి,మహిళలసంఘాన సేవజేయ
మానినీమణి భర్తనే మఱచి పోయె!!! 

(శంకరాభరణం  బ్లాగు లో30-09-2011 నాటి  సమస్యా పూరణ-477లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Thursday, October 6, 2011

శుభాకాంక్షలు!!!

 సకల జనులకు "విజయ దశమి" శుభాకాంక్షలు!!!

Wednesday, October 5, 2011

మామిడి ఫలమున్ దినంగ మరణము గల్గున్!!!

మామకు మధుమేహమ్మని
మామిడి ఫలమున్ దినంగ మరణము గల్గున్,
ఆమని రాదని,జీవన
మే మరిలేదని నుడివిరి మిడిమిడి వైద్యుల్!!!

(శంకరాభరణం  బ్లాగు లో22-09-2011 నాటి  సమస్యా పూరణ-468లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Tuesday, October 4, 2011

జాడ చూపి నట్టి జాఁడఁ గనుఁడు !!!

మట్టి జాడ జూపె మనిషిజాడను జూపె
దేశ భక్తి జాడ , దేహ శక్తి
జాడ, మంచిచెడుల జాడజూపెను,గుర
జాడ చూపి నట్టి జాఁడఁ గనుఁడు !!! 

(శంకరాభరణం  బ్లాగు లో21-09-2011 నాటి  సమస్యా పూరణ-467లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Monday, October 3, 2011

పదుగురుగనంగ వనితవివస్త్రయయ్యె!!!

పట్టణంబున పరుగెత్తె,పగటిపూట
పసిడి గొలుసులు మెడనుండి పట్టి లాగి
పదుగురుగనంగ వనితవి!! వస్త్రయయ్యె
కలికి కన్నీటిపొరలతో,కలతజెంది !

 
(శంకరాభరణం  బ్లాగు లో19-09-2011 నాటి  సమస్యా పూరణ-465లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

కాలు నమ్మి కొలిచి కాలు గెలిచె!!!

సతిగ సహనవతిగ సావిత్రి యానాడు
వాదు లాడి, వేడి వరము బొందె
మారెజీవితమ్ము,మరలె జీవనగమ
కాలు! నమ్మి కొలిచి కాలు గెలిచె!!! 

(శంకరాభరణం  బ్లాగు లో20-09-2011 నాటి  సమస్యా పూరణ-466లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Sunday, October 2, 2011

పట్టు బడెను చేప తుట్ట తుదకు!!!

గుట్ట పుట్ట నేల మట్టంబు పట్టించి
పట్టు బట్టి మంత్రి పదవి బట్టె
సూర్యు పట్టి  గట్టి చుట్ట మై నెట్టంగ
పట్టు బడెను చేప తుట్ట తుదకు!!!

(సూర్యు పట్టి= శనేశ్వరుడు)
(గాలి జనార్ధన్ రెడ్డి అరెస్ట్ యితివృత్తము ) 

(శంకరాభరణం  బ్లాగు లో18-09-2011 నాటి  సమస్యా పూరణ-463లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

యమునకు పద్యానురక్తి హాయిం గూర్చున్!!!

కుమతికిమద్యము, ఫలసా
యమునకు సేద్యము, సుమతుల కనవరతము వి
ద్య మరియును సుకవిసముదా
యమునకు పద్యానురక్తి, హాయిం గూర్చున్!!! 

రమణీయము హరి రూపము
కమనీయమ్మతనిలీల,కమలాపతి నా
మముపై పండిత సముదా
యమునకు,పద్యానురక్తి హాయింగూర్చున్!!  

(శంకరాభరణం  బ్లాగు లో17-09-2011 నాటి  సమస్యా పూరణ-462లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Saturday, October 1, 2011

దోచుకొన్నవాడె తోడునీడ!!!

గిరులు ఝరులు గనులు సిరులతో ధరనెల్ల
దోచుకొన్నవాడె తోడునీడ,
తల్లి,దండ్రి,సఖుడు,దైవసమానుండు
రాజ కీయ మందు రాజు నేడు!!!

(శంకరాభరణం  బ్లాగు లో16-09-2011 నాటి  సమస్యా పూరణ-461లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)