గతప్రాభవమునకు ప్రతిరూపమైనట్టి
....పలుకట్టడమ్ముల ప్రభలుతగ్గె
నిజమైన ప్రేమకునిలువెత్తుసాక్ష్యమౌ
....భాగ్యనగర సీమ పరువు తరిగె
విజ్ఞానగంధమ్మువిశ్వానికందించు
....విద్యాలయమ్ములు వికలమయ్యె
వాసిగాంచినమేటి మూసీసుజలధార
....మురికి కాల్వగమారి పరుగు లాపె
భిన్న జాతుల మద్య బిగిసిన బంధమ్ము
....లన్నదమ్ములమద్య నతుకులూడె
తెలుగు నగరాన నాంగ్లమ్ము వెలుగు చుండె
బలము గలిగిన వారికే ఫలము దక్కె
మేటి నగరాల కెల్లను సాటి, నాటి
భాగ్య నగరమ్ము హైదరాబాదు కాదు !!!
(శంకరాభరణం బ్లాగులో 29-08-2013 నాటి సమస్యా పూరణ- 1158 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
....పలుకట్టడమ్ముల ప్రభలుతగ్గె
నిజమైన ప్రేమకునిలువెత్తుసాక్ష్యమౌ
....భాగ్యనగర సీమ పరువు తరిగె
విజ్ఞానగంధమ్మువిశ్వానికందించు
....విద్యాలయమ్ములు వికలమయ్యె
వాసిగాంచినమేటి మూసీసుజలధార
....మురికి కాల్వగమారి పరుగు లాపె
భిన్న జాతుల మద్య బిగిసిన బంధమ్ము
....లన్నదమ్ములమద్య నతుకులూడె
తెలుగు నగరాన నాంగ్లమ్ము వెలుగు చుండె
బలము గలిగిన వారికే ఫలము దక్కె
మేటి నగరాల కెల్లను సాటి, నాటి
భాగ్య నగరమ్ము హైదరాబాదు కాదు !!!
(శంకరాభరణం బ్లాగులో 29-08-2013 నాటి సమస్యా పూరణ- 1158 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment