Friday, May 18, 2012

శని పట్టినవారల కగు సకలశుభమ్ముల్!!!

ఇనసుతుదింటను జేరిన
నొనగూర్చును బలునిడుములునొకటినగూడన్
తనపదకొండిoట గురువు,
శని పట్టినవారల కగు సకలశుభమ్ముల్!!! 


 (శంకరాభరణం  బ్లాగులో 17-05-2012 నాటి  సమస్యా పూరణ-707 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Thursday, May 17, 2012

పెన్నిధులు గల్గి సుఖియించు బేదవాడె!!!

వంద గదులున్నమేడలు వాహనములు
లక్ష కోట్లైన నిధులున్న లాభమేమి?
నీతి దప్పిన దుఃఖంబు నిజము; సుగుణ
పెన్నిధులు గల్గి సుఖియించు బేదవాడె!!! 

   
 (శంకరాభరణం  బ్లాగులో 16-05-2012 నాటి  సమస్యా పూరణ-706 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Wednesday, May 16, 2012

మాధవునకు శత్రువు గద మకరద్వజుడే !!!

నాదశరీరుండైన ను
మా ధవునకు శత్రువు గద మకరద్వజుడే
మోదము నింపగ రాగపు
బూదోటను దింపబోయి పుణ్యుoడయ్యెన్!!!
   
 (శంకరాభరణం  బ్లాగులో 15-05-2012 నాటి  సమస్యా పూరణ-705 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Tuesday, May 15, 2012

నరకలోకము గలదండ్రు నాకమందు!!!

తప్పు పనులను జేసిన తప్పదండ్రు
నరకలోకము; గలదండ్రు నాకమందు
శాంతి సౌఖ్యమ్ము సురమైత్రి సాదరమును
దీన జనసేవ జేసిన ధీయుతులకు !!!


  (శంకరాభరణం  బ్లాగులో 14-05-2012 నాటి  సమస్యా పూరణ-704లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Monday, May 14, 2012

సినిమాలను జూచువాడు శ్రీమంతుడగున్!!!

మనపౌరాణిక కథలను
ఘనముగనిర్మించినారు గతమునద్రష్టల్
మనముప్పొంగున్నేడా
సినిమాలను జూచువాడు శ్రీమంతుడగున్!!!


  (శంకరాభరణం  బ్లాగులో 13-05-2012 నాటి  సమస్యా పూరణ-703 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Saturday, May 12, 2012

అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందఱే!

కొందరు  భూబకాసురులు  కొందరు మద్యము మాఫియా ఘనుల్
కొందరు పుత్ర బాంధవుల  కూరిమి బెంచెడు  రాజశేఖరుల్ 
కొందరు మౌన ప్రేక్షకులు  కొందరు నల్లకుభేరులున్ గనన్
అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందఱే!

  (శంకరాభరణం  బ్లాగులో 11-05-2012 నాటి  సమస్యా పూరణ-701 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Monday, May 7, 2012

జారులు చోరులున్ కుటిలదారులు దుష్టులు దుర్మ దాంధులున్!!!

 సారపు విద్యయున్ వినయ సంపద గల్గిన సత్యవర్తనుల్
భారత భూమి  నేలిరట  భవ్యముగా  మును ధర్మ బద్ధులై
మారెను కాలమున్నడత మారెను పాలకులైరి యిప్పుడున్
జారులు చోరులున్ కుటిలదారులు దుష్టులు దుర్మ దాంధులున్!!!


 (శంకరాభరణం  బ్లాగులో 06-05-2012 నాటి  సమస్యా పూరణ-696 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)