Sunday, November 10, 2013

బల రాముడు లంక జేర వారధిగట్టెన్!!!

జలనిధి దాటగ, వానర
బలశాలురు తోడుగాగ, భాసుర లీలన్
ఖలులన్ ద్రుంచగ సద్గుణ
బల రాముడు, లంక జేర వారధిగట్టెన్!!!

శంకరాభరణం  బ్లాగులో 16-09-2013 నాటి  సమస్యా పూరణ-   1176లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు 

Friday, November 1, 2013

నాథ! “ఓం నమోనారాయణయ”యనకు!!!

హరిని దలచుచు సతతమ్ము తిరుగు మౌని
దైత్య నాథుడౌ కశపుని దరికివచ్చు
నారదుని గని గలడు నా నాథుడు ముని
నాథ! “ఓం నమోనారాయణయ”యనకు!!!

శంకరాభరణం  బ్లాగులో 07-09-2013 నాటి  సమస్యా పూరణ-   1167లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు