నేడు మా తండ్రి గారైన శ్రీ మంద రాజన్న గారి 24 వ వర్ధంతి .వారు ఎక్కువగా చదవక పోయినా తెలుగు సాహిత్యం పైన ఉన్న మక్కువతో పద్యాలు వ్రాసేవారు వారు 33 సంవత్సరాల క్రితం వ్రాసిన ఈ పద్యాలను నా యీ బ్లాగులో పెడుతున్నాను .
" ఉపనిషత్తులు జెప్పిన యుక్తమైన
ధర్మ సూత్రములన్నినిదానముగను
బ్రహ్మ మందు నాసక్తత బరగు నాదు
మనము నందుండు గాక సన్మానితముగ
దేవ నీస్తుతి జేతుము ధీయుతముగ
మా శరీరాంగములకును మంగళముగ
నీవు నిచ్చు దీర్ఘాయువు నిశ్చయముగ
అనుభవింతుము గాక యీ అవని లోన !
మమ్ము పరమేశ మాయా తమస్సు నుండి
ప్రబల తామసమజ్ఞాన పథము నుండి
తొలగ జేసి నీ జ్యోతిలో మెలగ జేయు
సాత్వికము లోన విజ్ఞాన కాంతిలోన ! "
మా తండ్రిగారు మాకు .......
ధనము నీయ లేదు ,ధర్మ మేమిటొజెప్పె
నీతి దప్ప నట్టి రీతి జెప్పె,
తత్వ సార మెల్ల తండ్రియే జెప్పెను,
సత్య పథము నందు సాగు మనుచు!
(ఆయన గారి ఆత్మకు శాంతి గలుగు గాక)
" ఉపనిషత్తులు జెప్పిన యుక్తమైన
ధర్మ సూత్రములన్నినిదానముగను
బ్రహ్మ మందు నాసక్తత బరగు నాదు
మనము నందుండు గాక సన్మానితముగ
దేవ నీస్తుతి జేతుము ధీయుతముగ
మా శరీరాంగములకును మంగళముగ
నీవు నిచ్చు దీర్ఘాయువు నిశ్చయముగ
అనుభవింతుము గాక యీ అవని లోన !
మమ్ము పరమేశ మాయా తమస్సు నుండి
ప్రబల తామసమజ్ఞాన పథము నుండి
తొలగ జేసి నీ జ్యోతిలో మెలగ జేయు
సాత్వికము లోన విజ్ఞాన కాంతిలోన ! "
మా తండ్రిగారు మాకు .......
ధనము నీయ లేదు ,ధర్మ మేమిటొజెప్పె
నీతి దప్ప నట్టి రీతి జెప్పె,
తత్వ సార మెల్ల తండ్రియే జెప్పెను,
సత్య పథము నందు సాగు మనుచు!
(ఆయన గారి ఆత్మకు శాంతి గలుగు గాక)
మీ తండ్రి గారి పద్యరచన ప్రశస్తంగా ఉంది. అలాంటి తత్త్వజ్ఞుల కుమారులైన మీరు ధన్యులు. మీ తండ్రి గారికి నా నమో వాకాలు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నాను.
ReplyDeleteశ్రీ శంకరయ్య నమస్కారము .మీ వ్యాఖలకు కృతఙ్ఞతలు.
ReplyDelete