పానమ్మే మానుమంచు పలికెడు వాడున్,
ద్యానమ్మే కోరు,దురభి
మానమ్మే లేని వాడు మాన్యుండయ్యెన్ !!!
(-ve) ప్రాణమ్మే తీయ నెఱుగు,
గానమ్మే సేయు నెపుడు,గౌరవ మంత్రిన్!
పానమ్మే నా పథమను,
మానమ్మే లేనివాడు మాన్యుండయ్యెన్ !!!
(శంకరాభరణం బ్లాగు లో17-12 -2010 నాటి సమస్యా పూరణ-171లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment