Wednesday, October 26, 2011

దీపావళి శుభాకాంక్షలు !!!

       దీపావళి శుభాకాంక్షలు 


పిల్లలు నవ్వుల ముల్లెలు,
పిల్లలు చిచ్చర    పిడుగులు  ,ప్రేమపు జల్లుల్,
పిల్లలు తారా జువ్వలు,
పిల్లల నవ్వులు   పుడమికి పెన్నిధి చూడన్ !

2 comments:

  1. "పిల్లలు నవ్వుల ముల్లెలు"సరైన చక్కని వర్ణన.
    మీకూ...., మీ ఇంటిల్లిపాదికీ.. "దీపావళి" శుభాకాంక్షలు. ఏదో.. సరదా.. ఊహాతేటగీతి...మీ బ్లాగు మాధ్యమంగా పంచుకుందామని తట్టింది. స్వాగతిస్తారుగా........?
    సిరికి లోకాన పూజలు జరుగు వేళ
    చూడ వచ్చెను నింగిన చుక్కలన్ని
    ఏడ జాబిలి ఎటుపాయె లేడదేమి?
    భువికి దిగెనేమొ అక్కకై "దివిలె" వోలె!

    ReplyDelete
  2. రాకుమార గారు నమస్కారము .ధన్య వాదములు. శ్రీ శంకరయ్య గారన్నట్లు చక్కని ధారాశుద్ధి గలిగి మీపద్యం శోభిల్లుతోంది.మీ ఇంటిల్లి పాదికి దీపావళి శుభాకాంక్షలు .

    ReplyDelete