Tuesday, October 25, 2011

మాట దప్పు వాడె మాన్యు డగును!!!

నీతి పాలకుండు నిత్యప్రసన్నుండు
కాటికాపరయ్యె మాటకొఱకు!
పదవి కొఱకు నేడు పలుమాటలను జెప్పి
మాట దప్పు వాడె మాన్యు డగును!!! 

(శంకరాభరణం  బ్లాగు లో 20-10-2011 నాటి  సమస్యా పూరణ-499లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

1 comment:

  1. కల్లబొల్లి మాట కడుబల్కి ప్రజలకు
    ఆశలెన్నొ చూపి అంతమందు
    పదవి పీఠమెక్కి పాలన జేయుచు
    మాట దప్పు వాడె మాన్యుడగును

    ReplyDelete