Thursday, October 27, 2011

సొమ్ము లున్న వాడె సుగుణ ధనుడు!!!

సత్య భాషణమ్ము సద్గురు సేవన
దైవచింతనమ్ము ధర్మనిరతి
శుభకరమగు నిట్టి శోభాన్వితములైన
సొమ్ము లున్న వాడె సుగుణ ధనుడు!!! 

(శంకరాభరణం  బ్లాగు లో 24-10-2011 నాటి  సమస్యా పూరణ-503 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

1 comment:

  1. ధనము కోట్ల కొలది దాచుకొన్నను గాని
    పండితుండె కాని ఫలము లేదు
    వినయ శీల సహిత విద్యా వివేకంపు
    సొమ్ములున్న వాడె సుగుణధనుడు.

    ReplyDelete