"లాడెన్, ఊడెన్, వీడెన్, వాడెన్"
పై పదాలను ఉపయోగించి
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ స్థితిగతులపై
నచ్చిన ఛందస్సులో పద్యం
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ స్థితిగతులపై
నచ్చిన ఛందస్సులో పద్యం
శ్రీ చిరంజీవిగారి రాజకీయ ప్రస్థానం.
పదునైన మాట లాడెన్,
వదనము వాడెన్,చివరకు వార్ధిన గలిసెన్!
(శంకరాభరణం బ్లాగు లో11-05-2011 నాటి దత్తపది 13 కి పద్య రూపం .తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
పదునైన మాట లాడెన్,
పదవిని యాశించి నాడు,పరపతి యూడెన్,
బెదిరెను, విలువలు వీడెన్ వదనము వాడెన్,చివరకు వార్ధిన గలిసెన్!
(శంకరాభరణం బ్లాగు లో11-05-2011 నాటి దత్తపది 13 కి పద్య రూపం .తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
పీతాంబర్ గారు, బాగా వ్రాసారు. చిన్న సందేహం. సాధారణంగా "పదవినాశించి" అని గాని (వ్యావహారికంలో), పదవిని యాశించి" అని గాని (గ్రాంధికంలో) అంటారు. "పదవిని నాశించి" అన్న ప్రయోగం కొత్తగా వుంది. ఏమంటారు?
ReplyDeleteనేడే మీ వ్యాఖ్యను గమనించాను మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు . మీరన్నది నిజమే .పొరపాటు నాదే. "పదవిని యాశించి"అన్నదే సరియైనది .సవరిస్తున్నాను.
ReplyDelete