శివ సంకల్పమొ,పూర్వ జన్మ ఫలమో శ్రీవాణి కారుణ్య మో,
కవి రాజన్యుల పద్యకావ్యముల తా కన్నార వీక్షించెనో ,
చవులూరించు కవిత్వతత్వ రసమా స్వా దించెనో, యాతడే
యవధానం బొనరించి పామరుడయెన్ ఖ్యాతుండు విద్వత్సభన్!
(శంకరాభరణం బ్లాగు లో20-03 -2011 నాటి వారాంతపు సమస్యా పూరణలోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment