హరుడను ,పావన గంగా
ధరుడను,శివుడను ,గిరిజకు ధవుడను ,నేనే
నిరువురి తరుణుల హృదయా
వరుడను, నాకేల వధువు వలదనె నతడున్!
(వేములవాడ ప్రాంతములో ఎందరో పడతులు రాజన్న సాన్నిధ్యం లో శివసత్తులుగా(శివసతులు)మారి శివుని స్తుతించే ఆచారమున్నది .భక్తితో ఒకడు తన సుతను శివసతిగా ఎలుకొమ్మన ,శివుడు భక్తునితో పై విధముగా అని ఉంటాడని భావన చేసాను.)
(శంకరాభరణం బ్లాగు లో26-02-2011 నాటి సమస్యా పూరణ-238లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment