Tuesday, March 15, 2011

నను నుతియించెడి జనులకు నవ నిధులబ్బున్!!!

ఇనుడుండు నంత కాలము
నను గొలువగ హెచ్చుసత్య నైపుణి గుణముల్ !
మనసారగ నరహరియగు
నను నుతియించెడి జనులకు నవ నిధులబ్బున్!!! 
(శంకరాభరణం  బ్లాగు లో12-02 -2011 నాటి  సమస్యా పూరణ-224లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. ) 

2 comments:

  1. సహజ మధురమైన మీ సరస పూరణా మకరందాన్ని పానం చేసి నా మనో మధుకరం పరవసించింది.

    ReplyDelete
  2. ధన్య వాదాలు సోమార్కగారు.

    ReplyDelete