Friday, March 11, 2011

"విద్య నేర్చిన వాడె పో వింత పశువు"

"విద్య నేర్చిన వాడె పో వింత పశువు"
విస్తు పోయిరి యిదివిని ,విబుధ వరులు,
తామెవరిమొననెడుశంక తమకు గలుగ!
శంకరయ్యను వేడిరి శంకదీర్ప!

విద్య వినయమ్ము నిచ్చును ,విత్త మిచ్చు,
నిచ్చు విజ్ఞాన ధనము దానిచ్చు యశము!
వెలుగు లార్పెడు, విలయమ్ము గలుగ జేయు
విద్య నేర్చిన వాడె పో ,వింత పశువు! 

(శంకరాభరణం  బ్లాగు లో31-01 -2011 నాటి  సమస్యా పూరణ-213లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

1 comment:

  1. విద్య నేర్పే వాడే వింత పశువు - కోదండరాం మీద నా పూరణ.

    ReplyDelete