Friday, December 10, 2010

పాహియని వేడితే పరమ పదమే నంట!!!

శశి ధరుడు,
విషగళుడు,
శుభకరుడు ,
భవహరుడు,
శివుడు,ఉమాదేవి విభుడు,శివుడు !!!
విశ్వజన హితమునకు విషము ద్రాగిన వాడు,
కోడెనాగుల దండ మెడను దాల్చిన వాడు,
పులితోలు వలువగా మొలను జుట్టిన వాడు,
శూల డమరుకములను కేల బట్టిన వాడు,
శివుడు  శోకమాపకుడు,.శివుడు!
కోరితే తీరైన వరము లిచ్చునటంట,
ముడుపు కడితే చాలు యిడుము లెడ మౌనంట,
మ్రొక్కితే ముక్కంటి  ముక్తి నొసుగునటంట,
పాహియని వేడితే పరమ పదమే నంట!
శివుడు లోక బాంధవుడు, శివుడు!!!

2 comments:

  1. చాలా చాలా బావుంది సార్.

    ReplyDelete
  2. కొత్త పాళీ గారు,
    నమస్కారం.మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete