యవ్వనపు ప్రాయమున వాంఛ లెవ్వరికిని
మతుల బోగొట్టు, మగువల మనసు దోయ
వెతలు బలు రీతి బడుదురు, వెకిలి ప్రేమ
యతి, విటుడు గాక పోవునే యతివ బిలువ!
(శంకరాభరణం బ్లాగులో 19 -10 -2010 నాటి సమస్యా పూరణ -127
లొ ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ .తోటి కవిమిత్రుల యితర మేటి పూరణలను మీరు
ఆ బ్లాగులో చూసి రసాస్వాదన పొందవచ్చును.)
No comments:
Post a Comment