1) రవి గాంచని చోటుల నిల
కవి గాంచును తన మనముతొ కవితలు సేయన్ ,
కవి కొమ్మల గెంతి నపుడు,
కవివరు కపితోడ బోల్చగా మెచ్చి రహో !
2 . రవియు తన కిరణములతో,
కవి తనపద చరణములతొ గంతులు వేయన్,
యువసతి కోతని తిట్టెన్
కవివరు కపితోడ బోల్చగా మెచ్చి రహో !
(శంకరాభరణం బ్లాగులో లోగడ సమస్యా పూరణ-130 లో ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.
ఇతర కవి మిత్రుల పూరణలను యీ బ్లాగులో చదివి రసాస్వాదన పొందవచ్చును.)
No comments:
Post a Comment