గౌరికుమారరార మము గావగ రావగదేల? మేము మీ
వారలమేర! మమ్ములను వర్ధిల జూడగ నేరమౌర?మా
వారును వారివారి పరివారము వారల బ్రోవుమంచు,బం
జారులు పూజ సేయగని సాధు జనుల్ పులకించి రెల్లరున్!
(శకరాభరణం బ్లాగులో 3 .11 .10 నాడు వారాంతపు సమస్యాపురణ -14 లో ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ .)
No comments:
Post a Comment