వెతల నెన్నింటి కోర్చెనో వెలుగు నీయ,
బ్రతుకు తీపిగా జేసెను భవ్య రీతి,
అన్ని లోకమ్ము లందున నరయ వేఱె
దైవమున్నదె సుతునకు తల్లి కంటె!
(శంకరాభరణం బ్లాగు లో24 -10 -2010 నాటి సమస్యా పూరణ132 లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షింఛి ఆనందింప వచ్చును.)
No comments:
Post a Comment