Wednesday, April 27, 2011

వదినను ముద్దడిగె మఱఁది పదుగురు చూడన్ !!

మదనుడు సందడి చేసెనొ,
మదిరా పానమున యన్న మరిచెనొ తనువున్
పదములు, పెదవులు తడబడ
వదినను ముద్దడిగె!!! మఱఁది ,పదుగురు చూడన్ !
(శంకరాభరణం  బ్లాగు లో15-04 -2011 నాటి  సమస్యా పూరణ-286లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   
 

  

 

9 comments:

  1. పరమ చెత్త గా ఉంది. అసలు సమస్యే ఇలాంటి అర్థం ఇస్తుంది. దాన్ని ఇంకో రకంగా పూరిస్తూ, ఆ అర్థాన్ని ప్రతిధ్వనించకుండా పూరించడం, సమస్యా పూరణం. అదే అర్థాన్ని యథాతథంగా ఇస్తూ, కవిత్వం వ్రాయడం నీచం.

    ReplyDelete
  2. పూరణ అస్సలు బాగలేదు. దయచేసి వెరే అర్థంతో వచ్చేల మార్చగలరు.

    ReplyDelete
  3. శ్రుతి మించినట్టు ఉంది, గమనించగలరు

    ReplyDelete
  4. వదినెను మరిది ముద్దడిగి నట్లు సమస్య. భర్తే ముద్దడిగినట్లు పూరణ చేయడం జరిగింది . వైవిధ్య మైన ఇతర పూరణలను శంకరాభరణం బ్లాగులో వీక్షించ వచ్చును .మీ స్పందనలకు ధన్య వాదాలు .

    ReplyDelete
  5. ఎబ్బెట్టు గా అసహ్యంగా అనిపించే సమస్యని తారుమారు చేసి, మఱదీ పదిమందీ చూస్తూండగా తాగి ఉన్న అన్న చేత వదినని ముద్దిమ్మని అడిగించాడు కవి. భర్త పదిమంది ఎదురుకుండా భార్య నడగటం కూడా మన సంస్కృతి లో ఎబ్బెట్టుగా ఉంటుంది కాబట్టి భర్తను తాగించాడు కవి.

    "కుంజరయూధంబు దోమ తుత్తుక జొచ్చెన్" సమస్యలు లాంటివి. ఇవి నిజంగా జరిగేవి కావు. జరగరానివి జరగకూడని సంఘటనలను ఎబ్బెట్టు లేకుండా సంస్కృతి లోకి మార్చి అన్న చేత భార్యని ముద్దు అడిగించటమే పూరణ లో కవి చేసిన పని. మీకు బాధ కలిగిస్తే మమ్ము క్షమించండి.

    ReplyDelete
  6. రాముడితోక లా ఉంది. మరిది పక్కన కామా లేకపొతే ఏ అర్థం వస్తుంది?

    ReplyDelete
  7. ఇంకా పద్యాలలో కూడా కామాలూ ఫుల్ స్టాపులు పెట్టి ద్దాము. మిమ్మల్ని బాధపెట్టినందుకు క్షమాపణలు.

    ReplyDelete
  8. లక్కి రాజు గారు ధన్యవాదాలు .సద్విమర్శ ఎప్పుడు హర్ష ణియమే,తొందరపాటుతో విమర్శలుచేసే వారని పట్టించుకోనక్కర లేదు .

    ReplyDelete
  9. కవి కి అర్థం అయ్యింది చాలు అనుకోరాదు. పద్యాలలో కామాలు కోమాలు వద్దంటే, కనీసం భావం సరిగా అర్థం అయ్యేలా వ్రాయాలి... మరిదీ పదుగురు చూడన్ అంటే ఒకే. మరిది పదుగురు చూడన్ అంటే, భర్త అనే వాడు అడుగుతున్నాడు అనే భావం ఎక్కడా రావడం లేదు. అదే చెప్పడం జరిగింది.

    ReplyDelete