సౌరభము సుంత లేని పుష్పములె మేలు,
లేక పోయిన రంగుల రేకులున్న కాగితపు పూలు చాలును ,వేగిరమున
తీసుకొని రమ్ము ,చిత్రమ్ము తీయవలెను.
తులసి దళముతో తూచెను తోయజాక్షి,
పిడికె డటుకులతో గొల్చె పేదసఖుడు.
ఆత్మసౌందర్య మేగదా హరికినచ్చు ,
(శంకరాభరణం బ్లాగు లో26-08-2011 నాటి సమస్యా పూరణ-438లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
పిడికె డటుకులతో గొల్చె పేదసఖుడు.
ఆత్మసౌందర్య మేగదా హరికినచ్చు ,
సౌరభము సుంతలేనిపుష్పములె,మేలు
జేయగనువచ్చు భక్తితోజేయ పూజ!!! (శంకరాభరణం బ్లాగు లో26-08-2011 నాటి సమస్యా పూరణ-438లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
మీకు, మీ కుటుంబ సభ్యులకూ వినాయకచవితి శుభాకాంక్షలు
ReplyDeleteశిరాకదంబం