Wednesday, September 21, 2011

రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ!!!

క్షణము తీరిక లేనట్టి జనులకిపుడు
చింతయేగాని నిశ్చింత సుంతలేదు
రామ భద్రుడౌ జానకీ రమణుని స్మ
రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ!!! 

కనక సింహాసనాసీన ఘనుల కిపుడు
కటిక నేలపై బవళిoచు గతులు బట్టె
పతన మైనట్టి తమగతవైభవస్ఫు
రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ!  

(శంకరాభరణం  బ్లాగు లో13-09-2011 నాటి  సమస్యా పూరణ-458లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

1 comment:

  1. చిక్కుముడుల సమస్యల జేర్చి వాని
    పూరణము చేయుడీయన బుద్ధికుశలు
    రాసమస్యల పూరింప నమరెడి వివ
    రణము హర్షంబు గూర్చు విశ్రాంతివేళ

    ReplyDelete