Wednesday, September 7, 2011

రంజానుకుచేయవలయురాముని భజనల్!!!

రాం,జయ జయరాం,సీతా
రాం,జయరాం శ్రీరఘుపతి రాఘవరాజా
రాం,జనరహీముని గొలువ
రంజానుకుచేయవలయురాముని భజనల్!!! 

అంజలి ఘటిత నమాజును
రంజానుకుచేయవలయు, రామునిభజనల్
రంజితముగ జేయందగు,
అంజనపుత్రుండుమెచ్చ నవనిజమెచ్చన్ !!!

(శంకరాభరణం  బ్లాగు లో31-08-2011 నాటి  సమస్యా పూరణ-444లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
 

2 comments:

  1. రంజన ముస్లిం ప్రార్థన
    రంజానుకు చేయవలయు ; రాముని భజనల్
    కంజదళాక్షుని, రక్షో
    భంజను పావన చరిత్ర పాడగ నితరుల్

    ReplyDelete
  2. మీ పూరణ ప్రశస్తంగా ఉంది.

    ReplyDelete