Sunday, October 31, 2010

చదువులమ్మ గుడిన బుధుల కేమాయెనో!

మనుమ రాలి వయసు మగువను మనువాడ ,
డెబ్బ దేండ్ల కెట్టి జబ్బు పుట్టె  ?
చదువులమ్మ గుడిన బుధుల  కేమాయెనో!
మంద వారి మాట మణుల మూట!
(బాసర దేవాలయంలో డెబ్బై ఏండ్ల  వృద్దుడు
13 వత్సరాలు నిండని బాలికను బంధువుల,భక్తుల
సాక్షిగా పెళ్లి చేసుకున్నట్లు, ''ఈనాడు''పత్రికలో వచ్చిన
వార్తకు స్పందించి వ్రాసిన పద్యం యిది.దురాచారము
నశించు గాక.)

2 comments:

  1. విషయం బాధాకరమైనా, మీ ఆవేదనను తెలియ జేసిన పద్యం చాలా బాగుంది.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    ReplyDelete