Friday, October 22, 2010

కష్ట సుఖాలకు కారణాలు

  కలిమి లేములకును కష్ట సుఖాలకు,
  కారణాలు దెలియ గలమె మనము ,
  పూర్వ జన్మ సుకృత పుణ్యాల ఫలమేమొ !
  మంద వారి మాట మణుల  మూట !

2 comments:

  1. మంద పీతాంబర్ గారూ,
    మీ బ్లాగు "సరదాకి చిరు కవిత" చూసాను. పద్యాలు బాగున్నాయి. "మంచు మూట" కంటే "మణుల మూట" బాగుంటుందేమో ఆలోచించండి. మీ బాగులో ఇంతవరకు ఎవరూ వ్యాఖ్యలు పెట్టలేదు. మీ బ్లాగును కూడలి, జల్లెడ, హారం, మాలిక మొదలైన బ్లాగ్ అగ్రిగేటర్ లలో చేర్చలేదా? అలా చేస్తే ఎక్కువమంది మీ బ్లాగును వీక్షించి, ప్రతిస్పందిస్తారు.

    ReplyDelete
  2. శ్రీ శంకరయ్య గారు ,నమస్కారము .మీరు నా
    బ్లాగును వీక్షించి నందులకు ధన్యవాదములు.
    నా బ్లాగును మీరు సూచించిన అగ్రిగేటర్లకు
    లింక్ చేసినాను ఇప్పుడిప్పుడే కొన్ని వాఖ్యలు
    వస్తున్నాయి . మకుటములో మీరు సూచించిన
    మార్పు పై ఆలోచిస్తున్నాను మీ సూచనకు కృతఙ్ఞతలు.

    ReplyDelete