బీడులన్ని పచ్చని పోలాలై పోయి నప్పుడు
మోడు లన్ని మళ్లీ నిండుగా చిగురించి నప్పుడు,
అన్నార్తుల కడుపు లన్ని అన్నం తో నిండి నప్పుడు
నిరుద్యోగుల కలలన్నీఉపాధితో పండి నప్పుడు,
నలిగిన చీకటి బ్రతుకుల్లో చిరు కాంతులు వెలిగి నప్పుడు,
అధర్మం సమాధియై ధర్మమే పునాదై నప్పుడు,
అసత్యం ఉరి కంబమెక్కి సత్యానికి ఊరట కలిగి నప్పుడు,
అన్యాయం పై న్యాయం గెలుపును సాధించి నపుడు
చెడుకు చెరుపు,మంచికి మెరుపు,
ఎప్పుడో అప్పుడే విజయ దశిమి
అది ఎప్పుడూ రావాలని
మన అడుగు
ముందుకే పడాలని
అందుకే మనం మారాలని
ఆ దశను నిండుగా కోరుకుందాం
ఈ దశమి పండుగ చేసుకుందాం.!
అందరికి దసరా శుభా కాంక్షలు.
No comments:
Post a Comment