Friday, October 8, 2010

ముత్యాలు రాలునా ?

పొట్ట చేత బట్టి  పొద్దంత కష్టించు 
కూలి వాని గూడు కూల్చనేల
ముష్టి వాని మొట్ట ముత్యాలు రాలునా ?
మంద వారి మాట మణుల  మూట!

సెల్లు చెవిన బెట్టి చేత బైకును బట్టి
సొల్లు మాట లాడి సోలి పడగ
ముప్పదారు పళ్ళు మూడు పళ్ళవ్వవా
మంద వారి మాట మణుల మూట !

తప్పు  తాము జేసి  ఒప్పుగా వాదించు
మూఢ  మతుల వలన ముప్పు పొంచు
అట్టి వారి జట్టు కట్టిన ఫలమేమి ?
మంద వారి మాట మణుల మూట!
                                           
                                        
                                            

2 comments:

  1. సెల్లు చెవిన బెట్టి చేత బైకును బట్టి
    సొల్లు మాట లాడి దొర్లి పడగ
    ముప్పదారు పళ్ళు మూడు పళ్ళవ్వవా
    మంద వారి మాట మంచు మూట !---
    హా..హా..బలే అల్లారండి పద్యం!
    శతమానం భవతి ! అని దీవిస్తున్నా!
    శతకం పూర్తి చేయాలి!-నిజంగానే ఈ కందంలో ల రాయలనుకుంటే ఆ ఛందస్సు తప్పకుండ పాటించాలి! అప్పుడే కావ్య గౌరవం దక్కుతుంది!

    ReplyDelete
  2. మీ స్పందనకు ,ప్రోత్సాహానికి మరియు దీవెనలకు ధన్య వాదములు.

    ReplyDelete