విలువల వలువూడ దీసి
నీతిని గోతిలో పాతి
న్యాయానికి తారు పూసి
సత్యానికి శిలువ వేసి
చట్టాలను సంకెళ్ళను
సామాన్యుల మెడన చుట్టి
అదరగొట్టి బెదరగొట్టి
పసి పిల్లల నోళ్ళు గొట్టి
ప్రజల కడుపు మాడ గొట్టి
పచ్చని చేలలో సైతం
సెజ్జుల కార్చిచ్చు పెట్టి
అసత్యాల పునాదిపై
అక్రమ హార్మ్యాలు గట్టు
దుష్టుల దాష్ట్యీకానికి
అంతమెప్పుడో ?
ఈకుట్రలు కుతంత్రాలు ఆగుటేప్పుడో?
బలహీనుల గుండె చప్పుడాగి నప్పుడా !
శ్రమ జీవుల స్వేదజలం మరిగినప్పుడా ?
No comments:
Post a Comment