శ్రీ కొక్కు అశోక్ కుమార్ B .Sc .B.Ed మేడిపెల్లి(జగత్యాల)మండల M.E.O గారుఈ నెల జూన్ 30{2011) న పదవీ విరమణ చేస్తున్న సందర్భమును పురస్కరించుకొని వారి చిన్న బావ మంద పితాంబర్ గారు సమర్పిస్తున్న నవరత్న పద్య మాలిక!!!
1
"కొక్కు సత్య నారాయణ" కొడుకతండు ,
సుమతి "రాధకు " గారాల సుతుదతండు,
నామము "అశోక్ కుమారు"డు,నయము మీర
సతి "సుజాతకు" రాగాల పతియతండు.!!!
2
ఆచార్యుని తనయుండై
నాచార్యుల కెల్ల మిగుల నాత్మీ యుండై
నాచార్యుండే నతడై
నాచార్యు లకే నతండు నధికారయ్యెన్!!!
3
తెల్లని నవ్వుల రువ్వుచు,
పిల్లల మది దోచినావు ,ప్రేమగ వారిన్
మెల్లగ విద్యా గంధపు
వెల్లువలో తడిపినావు విజ్ఞాన నిధీ !
4
అధికారతనే యైనన్
నధికారిగగాక నతడు నాత్మీయతతో
విధులన్నియు సంప్రీతిగ
బుధులందరుమెచ్చ,జేసి పూజ్యుండయ్యెన్ !!!
5
హంగులు లేవుజూడ , దరహాసము మోమున జిందులేయ ,నే
రంగుల నద్దినా వొగద ,రాళ్ళకు విద్దెల సారమద్ది,"సా
రంగ పు రంబునందు ",గిరి రాజుల పిల్లల కెల్ల వర్ణ సా
రంగమవై ,జనాదరణ రాజస మొప్పగ బొందినావిలన్ !!!
6
వేడకనే వరము లొసగి
తోడుగ నెప్పుడు నిలబడి త్రోవను జూపే
వాడివనిరి "మేడి పెల్లి" న ,
వాడని బంధము గనబడె వారిజ నేత్రా!!!
7
పాఠశాల లన్న ప్రాణంబు నిచ్చును
పిల్లలందుప్రేమ వెల్లి విరియు
విద్య గొప్ప దనము వినయమ్ముగాజెప్పి
మాననీయుండు విద్దెల మాంత్రికుండు,
గర్వ మిసుమంతయునులేని కార్మికుండు
దాన ధర్మమ్ము జేసిన ధార్మి కుండు ,
భావి పౌరుల మేలెంచు భావుకుండు ,
శుభ కరుండు సద్గుణ శోభితుండు ,
సత్య వచనుండు సజ్జన సమ్మతుండు!!!
9
మదిలో మల్లెలు పూయగ
పదుగురు నిను మెచ్చినారు ,పరిణిత మతితో
పదవికి వన్నెల నద్దిన
చదువుల దొర ,నీకుగల్గు చక్కటి శుభముల్!
7
పాఠశాల లన్న ప్రాణంబు నిచ్చును
పిల్లలందుప్రేమ వెల్లి విరియు
విద్య గొప్ప దనము వినయమ్ముగాజెప్పి
వినుతి కెక్కె నతను విమల మతుడు !
8మాననీయుండు విద్దెల మాంత్రికుండు,
గర్వ మిసుమంతయునులేని కార్మికుండు
దాన ధర్మమ్ము జేసిన ధార్మి కుండు ,
భావి పౌరుల మేలెంచు భావుకుండు ,
శుభ కరుండు సద్గుణ శోభితుండు ,
సత్య వచనుండు సజ్జన సమ్మతుండు!!!
9
మదిలో మల్లెలు పూయగ
పదుగురు నిను మెచ్చినారు ,పరిణిత మతితో
పదవికి వన్నెల నద్దిన
చదువుల దొర ,నీకుగల్గు చక్కటి శుభముల్!
No comments:
Post a Comment