కాఫి, సిగరెట్టు, విడియమ్ము,కార్డు లాట,
రేసు గుర్రాలు ,బ్రాకెట్టు రేయిపగలు
మోహ తాపమ్ము,పానమ్ము మోదమౌట
బ్రహ్మ చారికి నెనమండ్రు భార్య లౌర!!
(శంకరాభరణం బ్లాగు లో14-01 -2011 నాటి సమస్యా పూరణ-197లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment