Tuesday, November 30, 2010

తిరుమల గిరి వేంకటపతి తీరెను కొలువై!

తిరుపతి నగరపు సిగపై
తిరుమల గిరి వేంకటపతి తీరెను కొలువై!
అరిచిరి అలిపిరి నుండే
మురిపెపు మూటల ముడుపులు ముంగిట దింపన్ !

పిలిచిన పలుకగ లేవా!
అలిసితివా?కలిసి సోలిసి అలివేణులతో!
వెలిసెను  తమ ఇలవేల్పని
తలిచిరి పలువురు!నినుగన తరిలిరి గొలువన్!  

2 comments:

  1. తిరుమల తిరుపతి యాత్ర పూర్తి చేసికొని రాగానే ఆ స్వామిని, ఆ క్షేత్రాన్ని గుర్తుకు తెచ్చే మంచి పద్యాలు ఆనందాన్ని కలిగించాయి. ధన్యవాదాలు.

    ReplyDelete
  2. మీ తిరుపతి ప్రయాణం శుభప్రదంగా జరగడం ఆనందంగా వుంది.
    మీ వ్యాఖ్య సంతోషం కలుగ జేసింది.మీకు ధన్య వాదములు.

    ReplyDelete