బాలల దినమును (14 -11 -2010 ) పురస్కరించుకొని వ్రాసిన కవితలు .
కల్లలు తెలియని వారము,యెల్లలు మామధ్య లేవు,యెపుడును మా మా
యుల్లము లందున స్నేహపు
జల్లులె కురియును తరగని జయములు కలుగున్ !
పిల్లలు నవ్వుల ముల్లెలు,
పిల్లలు చల్లని పిడుగులు ,ప్రేమపు జల్లుల్,
పిల్లలు తారా జువ్వలు,
పిల్లల యల్లరె పుడమికి పెన్నిధి చూడన్ !
No comments:
Post a Comment