సాయి షిర్డి లోన సత్యమై వెలిసెను,
సాయిని గన గలిగె సంతసంబు,
దీన జనుల సేవ దివ్య మార్గమ్మనె,
మంద వారి మాట మణుల మూట!
సాయికి సత్య కీర్తికిని,సద్గురు సద్గుణ సాధు మూర్తికిన్,
హాయిని గూర్చ మంగళపు హారతు లిచ్చిరి సజ్జనోత్తముల్,
శ్రేయము సేవ మార్గమని చేతల జెప్పిన చిద్విలాసి! నే
నాయువు గల్గునన్ వరకు ఆయన మార్గమె నాశ్రయించెదన్ !!!
(బాబా గారిని షిర్డి లో 14 -11 -2010 నాడు దర్శించు కొన్న
సందర్భములో కలిగిన అనుభూతికి అక్షరరూపం )

jaya gurudatta
ReplyDelete