ధర్మ రాజు గలిగె తమ్ముల నలుగుర
గాలి కొడుకునకును గలరు మువురు
నరుని కిరువురు మరి నకులుని కొక్కరే
పంచ పాండ వులన పదుగురు కద !
(నలుగురు +మువ్వురు +ఇరువురు +ఒక్కరు = పదుగురు.)
4+3 +2 +1 =10 .
ప్రతిభ ఎంత గలదొ పౌరాణికము లందు
పదిలొ కెళ్ళి డీవొ ప్రశ్న లడుగ
చెప్పు వారి గనక చెప్పెను పంతులే
పంచ పాండ వులన పదుగురు కదా !
( పది లొ =పదవ తరగతి ,డీవొ = D E O సరదాగా వ్రాసినది ఎవరినీ నొప్పించాలని కాదు విద్యార్ధులకు ఉపాధ్యాయులకు క్షమాపణలతో}
No comments:
Post a Comment