Sunday, November 21, 2010

హరిసంకీర్తన యిడుముల నార్చును,

కార్తీ కమ్మున గిరిజా
మూర్తిని, కీర్తింప గలుగు మొక్షము! హరిసం 
కీర్తన యిడుముల నార్చును,
ఆర్తుల కోర్కెలు దీర్చును,అనితర కీర్తిన్!

శ్రీరమ కన్నుదోయి మురిసెన్ హరి చిన్మయ రూపు గాంచి,శ్రీ 
గౌరియు ఈశుజేరి మమకార సరాగపు డోలలూగె,వా  
ణీ రమణీయమై కమల నేత్రుని నాథుని  ప్రీతిజేసె,శృం 
గారత మీరగా పతుల గానము జేసిరి మొహనంబుగా!

2 comments:

  1. పీతాంబర్ గారు, చాలా బాగున్నై.
    కందంలో ర్త అన్న ప్రాస ఉక్కిరిబిక్కిరి చేస్తే, ఉత్పలలో త్రిశక్తులనూ త్రిమూర్తులతో సంగమించి శృంగారం అద్భుతంగా నిర్వహించారు.

    ReplyDelete
  2. కొత్త పాళీ గారు ,నమస్కారం.
    మి వ్యాఖ్యలకు ధన్యవాదములు.
    మీ ప్రశంస నాకు టానికులా పనిచేస్తుంది.కృతఙ్ఞతలు.

    ReplyDelete