ప్రజల సొమ్ము పైన పట్టింపు లేదురా!
పార్ల మెంటు లోని పాలకులకు,
కాకి గోల జేసి కేకలేస్తుంటారు
మంద వారి మాట మణుల మూట!
(గత కొన్ని రోజులుగా పార్లమెంటు జరుగుతున్నతీరు ఆవేదన కలిగిస్తుంది
సమావేశం ప్రారంభం కావడం,అతి పెద్ద కుంభ కోణముపై J P C వేయాలని,
ప్రతి పక్షాలు పటుబట్టడము,అంతే పట్టుదలతో అధికార పక్షం J P C వేయడము కుదరని
బెట్టు చేయడం కొద్ది రోజులుగా జరుగుతున్నతంతు.అసలే లక్షా డెబ్బది వేల కోట్ల స్కాం అని
అంటున్నారు.పార్లమెంటు సమావేశాలకు నిముషానికి కొన్ని లక్షలు ఖర్చు అవుతుందని
లెక్కలు చెప్పేది వాళ్ళే! ప్రజా ధనాన్ని ఇలా దుర్వినియోగము చేసేది వాళ్ళే!జవాబు దారితనము
లేనే లేదు, ఆపై అధికారానికి ప్రాకులాట.అవినీతికి ఆస్కార మిచ్చేది,అవినీతిని పెంచి పోషించేది,
అవినీతిని సర్వ శక్తులోడ్డి రక్షించేది ప్రభుత్వమే నని సామాన్యుల కనిపిస్తుంది.అందులో అతిశయోక్తి
లేదు.
గత 60 ఏండ్లలో అవినీతి తో దోచి ,విదేశాలకు తరలించిన సంపద లెక్కలు తెలుసుకొంటే మీరు
ఆశ్చర్య చకితు లౌతారు .వివరాలకు "మీ కోసం"బ్లాగు లోని "భారత దేశం లోని అక్రమ
సంపాదకులు 1948 నుండి 2008 వరకు 20 లక్షల కోట్ల డబ్బును విదేశాలకు తరలించేరు "
అన్న 22 -11 -2010 తేది పోస్టును చూడండి.ఇదంతా మనదేనా అని గుండెలు బాదుకుంటారు.)

No comments:
Post a Comment