Monday, November 22, 2010

అర్ధ రాత్రి సతిని అచ్చోటె వదిలేసి!,

అర్ధ రాత్రి సతిని అచ్చోటె వదిలేసి,
దిగెను సెల్లు కొఱకు దిగులుపడక
తల్లి ,పిల్ల  కంటె సెల్లంత  ముఖ్య మా?
మంద వారి మాట మణుల మూట!

(ఇది 15 -11 -2010 నాడు జరిగిన సంఘటన.మేము ప్రయాణిస్తున్న  షిర్డి నుండి సికింద్రాబాదు ట్రైన్ నంబర్7001 . స్లీపర్ S8 కోచ్ లో తోటి ప్రయాణికుడు అర్ధ రాత్రి పూట 3 గంటల సమయాన   పర్భని -ఉస్మానాబాద్ మధ్య సెల్లు టాయిలెట్ లో జారి పడిందని ,భార్య దగ్గరలో ఉన్న సెల్లును కుడా తీసుకొనివెంటనే రైలును దిగేసాడు.పాపం ఆమె కళ్ళ నీళ్ళ పర్యంత మైంది.ఇద్దరు చిన్నపిల్లలు ,మూడు పెద్ద మూటలు.ఆవిడకు రెండు సమస్యలు భర్త చీకట్లో అర్ధ రాత్రి పూట సెల్లు వెదుకులాటలో ఎన్ని అవస్థలు
పడ్తున్నాడో , ఇంటికి ఏలా రాగలడో అని ఒకటి, తనకు తన భర్త సెల్ నెంబర్ మాత్రమే జ్ఞాపకం ఉంది.దానికి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది .తన సెల్ నెంబర్ కాని, ఇతర బంధువుల సెల్ నెంబర్లు గాని జ్ఞాపకము లేవు.ఇంటికి ఏలా చేరాలి అనే బాధ మరొక వైపు.అలా రాత్రంతా బాధ పడుతూనే ఉంది .మేము ధైర్యం చెప్పి ,ఆమెకు తోడుగా ఉండి,వారి పిల్లల్ని ,సామాన్లను మా సామాన్ల తో పాటు మోసి,సికింద్రాబాద్ స్టేషన్ బయటకు వచ్చి వారిని దగ్గరలోనే ఉన్న వారి బంధువుల ఇంటికి సురక్షితంగా పంపించడం జరిగింది. మరునాడు ఆవిడ మాకు కాల్ చేసి    తనభర్తతెల్లవారురాత్రి11గంటలకుఇంటికివచ్చినట్లుతెలిపింది,కృతఙ్ఞతలుతెలియజేస్తూ! .సెల్లు మాత్రం దొరకనే లేదట!  ప్రయాణంలో సెల్లులను జాగ్రత్తగా పెట్టుకోవడము,ముఖమైన సెల్ నెంబర్లను వేరేగా వ్రాసి పెట్టుకోవడము ఎందుకైనా  మంచిదని అనిపించింది.అతను అలా వెళ్ళడం ఎంతవరకు సబబో మీరే చెప్పాలి?)
  
                                                                                               

3 comments:

  1. పాపం ఆ ఇల్లాలు .
    మీ సూచన పాటించతగినది .

    ReplyDelete
  2. బాగుంది. కాని "రైల్ను విడిచె" కంటె "రైలు దిగెను" అంటే బాగుంటుందేమో?

    ReplyDelete
  3. కం//
    సెల్లే ముఖ్యమ వెధవకి
    పెళ్ళాము మరియు కన్న పిల్లల కంటెన్??
    పళ్ళూడ లాగి గట్టిగ
    ఛెళ్ళని ఒకటేయవలెను చెంపన, శ్యామా!!

    ReplyDelete