Sunday, August 5, 2012

పాఠశాల!!!



గురువులు దైవ సమానులు,
తరగతి దేవాలయమ్ము, ధరణిన్ ధర్మా
చరణే చదువులు గావలె
నరులే గావలె సురలుగ నైపుణ్యమునన్ 

ప్రకృతి నియమాలు దెలుపు సువర్ణశాల
ధర్మ మార్గమ్ము జూపు సద్దర్మశాల
జ్ఞాన మార్జింప జేయు విజ్ఞానశాల
బాలలను తీర్చి దిద్దుసౌభాగ్య శాల
పరమ పూజ్యమై దనరారె పాఠశాల!!!

(శంకరాభరణం బ్లాగు లో  03-08-2012  నాటి పద్య రచన-70 లో  వ్రాసినపద్యం ఇతర కవిపండితుల పద్య రచనలు ఆ బ్లాగులో  వీక్షించ వచ్చును.)


No comments:

Post a Comment