Saturday, August 4, 2012

కబడి!!!



 బుడతలకు యువజనులకును
కడుప్రీతినిగూర్చుకబడి కనుమరుగాయెన్
చెడుగుడు లాడుచు క్రీడల
నొడిదుడుకులపాలొనర్పనుచితంబౌనే?

బడిపిల్లలకూరిప్రజకు
కడు బ్రీతిని గూర్చునట్టి కబడిని నేడా
డెడువారులేరు;కనబడె
చెడుగుడు నేటికినిట చిరుచిత్రమునందున్!!!

(శంకరాభరణం బ్లాగు లో  01-08-2012  నాటి పద్య రచన-68 లో  వ్రాసినపద్యం ఇతర కవిపండితుల పద్య రచనలు ఆ బ్లాగులో  వీక్షించ వచ్చును.)

No comments:

Post a Comment