నా చిరకాల మిత్రుడు శ్రీ ఆంజనేయులు ,విశ్రాంత హెడ్ క్యాషియర్ S.B.H సిరిసిల్ల వాస్తవ్యుడు 14-03-2012 నాడు పరమపదించినారు వారి ఆత్మకు శాంతి చేకూరు గాక .
కల్మషమ్ము లేని కారుణ్య మూర్తివి
దివికి జేరి నావు భువిని వీడి
విశ్వ శాంతి గోరు విమల మతివి నీవు
ఆంజనేయ నీకు అంజ లింతు
రాజ రాజైన పట్టపు రాణి యైన
మాన్యు డైనను సర్వ సామాన్యుడైన
పుట్టి నటువంటి ప్రతిజీవి గిట్టవలయు
చిట్ట చివరికి శివునికి ముట్ట వలయు !!!
No comments:
Post a Comment