Tuesday, March 13, 2012

దార్త రాష్ట్రులు నడచిరి ధర్మ పథము!!!

పాండు భూవరు కోడలి వలువ లొలిచి
నిండు పేరోలగంబున నీచు లైరి
దార్త రాష్ట్రులు !!! నడచిరి ధర్మ పథము
న సతతము పాండు సుతులు బడసిరి యశము !!!
   
(శంకరాభరణం  బ్లాగు లో12-03-2012 నాటి  సమస్యా పూరణ-644 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

1 comment:

  1. తెలుగు పదజాలమున పట్టు , తేట తెలుగు
    మాటలను కూర్చు నేర్పులు , మహిత శైలి
    మంద పీతాంబరుల పద్యమందు నిలిచి
    విరిసె “ చూడంగనే చదివించు గుణము “

    బ్లాగు: సుజన-సృజన

    ReplyDelete