బాలుదతండుగాడు జనపాలుడు పూతనపూతచన్నులన్
పాలును గ్రోలిగూల్చినకృపాళువు దేవకిముద్దుబిడ్డడున్
చేలముఫించముoదడువ చెంగునదూకెసరస్సునందునన్
లీలలునద్భుతంబు,నవలీలగగర్వమడంచెసర్పికిన్!!!
కాళింది మడుగు నందున
కాళీయుని మదమడంచ కాలయముండై
కేళీ వినోది కృష్ణుడు
కాళీయుని పడగపైన కథకళి సలిపెన్ !!!
(శంకరాభరణం బ్లాగు లో 26-07-2012 నాటి పద్య రచన-62లో వ్రాసినపద్యం ఇతర కవిపండితుల పద్య రచనలు ఆ బ్లాగులో వీక్షించ వచ్చును.)
No comments:
Post a Comment