వందే శ్రీకరి శుభకరి
వందే వరలక్ష్మి మాత వందన మమ్మా !
వందే హరిదొరసానికి
వందే సిరులిడెడు రాణి వందనశతముల్ !!!
వరలక్ష్మి పూజ జేసిన
సిరులన్నియుగురియునింట చింతలుదీరున్
పెరుగును పతులకు నాయువు
పరమానందమ్ముగలుగు పడతులకెల్లన్ !!!
(శంకరాభరణం బ్లాగు లో 27-07-2012 నాటి పద్య రచన-63 లో వ్రాసినపద్యం ఇతర కవిపండితుల పద్య రచనలు ఆ బ్లాగులో వీక్షించ వచ్చును.)
No comments:
Post a Comment