వందే వందే మాతరం
బహు సుందరం మన భారతం ''వందే''
జన గణ మన భాషితం
జల వన నగ భూషితం
రాగ వర్ణ రంజితం
సువర్ణ వజ్ర శోభితం "వందే"
తలపైన హిమవన్నగము
తనచుట్టూ సాగర జలము
ఫాలభాగమున రమ్య కాశ్మీరం
పద పీటమ్మున కన్యకుమారిం
తూరుపు దిక్కున అరుణ ప్రదేశం
పడమటి మెడలో మహ రాష్ట్రీయం "వందే"
భిన్న భిన్న జాతులు విభిన్నమైన రీతులు
ఎన్నెన్నో భాషలు వెలుగుల మణిపూసలు
పలుమతాల తోరణం ధర్మ శాస్త్ర మేళనం
సత్య శాంతి అహింసలకు చక్కని సమ్మేళనం "వందే"
సింహా లేలిన గడ్డ ఇది గాడిదలకు తల వంచేనా
పిరికి పందలకు గుంట నక్కలకు
పులు లెపుడైనా బెదిరేనా
వీరజవానుల ప్రతాపాగ్నిలో
ఎవరైనా మాడకపోరా
బొగ్గై బుగ్గై మగ్గకపోరా .
మిగిలిన ఉరికంబం ఎక్కగ పోరా .
( ఈ కవిత ముంబై తాజ్ హోటల్ పై పాక్ తీవ్రవాదుల దాడి సందర్భంలో వ్రాసినది .ఈదాడిలో
అసువులు బాసిన అమర వీరులందరికీ అంకితం .)
No comments:
Post a Comment