శుభాకాంక్షలు !!!
అరుణ కిరణాలు ధరణిపై నల్లుకొనగ
డిల్లి పురవీధు లెల్లను తల్లడిల్ల
తనువు విడిచెను దౌష్ట్యమ్ము తాళ లేక
ధీర ఆత్మకు శాంతిని జేర నిమ్ము !!!
భరతమాత ముద్దుబిడ్డ నిర్భయ ఆత్మకుశాంతిచేకూరు గాక !!
మిత్రులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు !!!
అరుణ కిరణాలు ధరణిపై నల్లుకొనగ
డిల్లి పురవీధు లెల్లను తల్లడిల్ల
తనువు విడిచెను దౌష్ట్యమ్ము తాళ లేక
ధీర ఆత్మకు శాంతిని జేర నిమ్ము !!!
భరతమాత ముద్దుబిడ్డ నిర్భయ ఆత్మకుశాంతిచేకూరు గాక !!
మిత్రులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు !!!
అన్వర్థ నామ ధేయిగ
ReplyDeleteనన్వి ష్ఠంబ య్యెనిర్భ యమగువ లందున్
తన్వీ తెస్తివి తెగువల
నన్వీతంబగు కలయిక యందరి లోనన్.
నిర్భయ తనువు చాలించినా ఎందరికో నిర్భయత్వాన్ని స్ఫూర్తిగానిచ్చి ప్రభుత కళ్ళు తెరిపిస్తున్నది.కొత్త చట్టం రూపుదాల్చి అది యున్నంత వరకు నిర్భయ చిరంజీవి.ఆమె ఆత్మకు శాంతి, కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
మిత్రులందరికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.