Thursday, September 22, 2011

పదపదమందు శోభిలును భారతి పాదవిభూషణ ధ్వనుల్!!!

సదమల వేదశాస్త్రచయ సారమునంతయుకొంతకొంతగా
పదములకద్ది  , పద్దియముపద్దియమందునపంచదారయున్
వదులుతువ్రాసె భాగవతవాణిని పోతన నాడు నందునన్
పదపదమందు శోభిలును భారతి పాదవిభూషణ ధ్వనుల్!!! 

(శంకరాభరణం  బ్లాగు లో18-09-2011 నాటి  సమస్యా పూరణ-464లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

1 comment:

  1. ముదమున నందబాలకుని ముగ్ధమనోహర బాల్యలీలలన్
    మృదుల మనోజ్ఞ భావముల మించెడు పద్యవిశిష్ట శైలిసం
    పదల రచించె పోతన యపారపవిత్రగుణాత్మకమ్ముగా
    పదపదమందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనుల్.

    ReplyDelete