Saturday, April 30, 2011

నారాయణ యనినవాఁడు నవ్వుల పాలౌ!!!.

హిరణ్య కశిపుడు నారదునితో ఇలా అంటున్నాడు.

నారాయణ పారాయణ
నారద నీనోట తగదు ! నా నామమ్మే
నోరారగ పలుకందగు,
నారాయణ యనినవాఁడు నవ్వుల పాలౌ!!!.
(శంకరాభరణం  బ్లాగు లో18-04 -2011 నాటి  సమస్యా పూరణ-289లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   
 

 

Friday, April 29, 2011

కల్ల లాడు వాడు ఘనుడు భువిన !

సత్య మెపుడు బల్కు ,సార్వ భౌముండైన,
కాటి కాప రాయె నాటి దినము !
నేటి కాల మందు కాటి భూముల నమ్మి
కల్ల లాడు వాడు ఘనుడు భువిన ! 
(శంకరాభరణం  బ్లాగు లో17-04 -2011 నాటి  సమస్యా పూరణ-288లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   
 

 

Thursday, April 28, 2011

నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నుని నిన్నున్!

ధనమే పరమావదిగా
జనులను హింసించ, మిమ్ము , జగదీశ్వరుడే
దునుమును, మీరే డున్నను,
నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నుని నిన్నున్! 
(శంకరాభరణం  బ్లాగు లో16-04 -2011 నాటి  సమస్యా పూరణ-287లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   
 

  

  

Wednesday, April 27, 2011

వదినను ముద్దడిగె మఱఁది పదుగురు చూడన్ !!

మదనుడు సందడి చేసెనొ,
మదిరా పానమున యన్న మరిచెనొ తనువున్
పదములు, పెదవులు తడబడ
వదినను ముద్దడిగె!!! మఱఁది ,పదుగురు చూడన్ !
(శంకరాభరణం  బ్లాగు లో15-04 -2011 నాటి  సమస్యా పూరణ-286లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   
 

  

 

Tuesday, April 26, 2011

అంధు డానందమున మెచ్చె నతివ సొగసు !

అతను బాహ్య సౌందర్యమ్మునరయ లేడు,
మనుసు పొరలను చదివిన మౌని గాన
యాత్మ సౌందర్య వీక్షణ యతను జేసి
అంధు డానందమున మెచ్చె - నతివ సొగసు ! 
(శంకరాభరణం  బ్లాగు లో08-04 -2011 నాటి  సమస్యా పూరణ-280లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   
 

  

Monday, April 25, 2011

నిద్ర మత్తును వీడిన నీకు గలుగు శుభము,

నిద్ర బద్దకము నొసంగు నీకు, సిరులు
గలుగ నేరవు, సుఖములు గాన రావు!
నిద్ర మత్తును వీడిన నీకు గలుగు
శుభము,శాంతియు , విజయపు సూత్ర మిదియె!

Sunday, April 24, 2011

ఖరమె మనకొసంగు ఘన సుఖములు!

దీన రక్షకుండు, దివ్య స్వరూపుండు,
పావనుండు,లోక పాలకుండు ,
శ్రీనివాసుడుండు శ్రీవేంకట గిరి శి
ఖరమె, మనకొసంగు ఘన సుఖములు! 
(శంకరాభరణం  బ్లాగు లో06-04 -2011 నాటి  సమస్యా పూరణ-278లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   
 

 

Saturday, April 23, 2011

గీత జూపిన మార్గమే గీటు రాయి

గీత జూపిన మార్గమే గీటు రాయి
పనుల బట్టియే వచ్చును ఫలిత మెపుడు
వ్రాత యుండిన చాలదు చేత లేక
ధాత వ్రాసిన వ్రాతలె తప్పులయ్యె. 
(శంకరాభరణం  బ్లాగు లో05-04 -2011 నాటి  సమస్యా పూరణ-277లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   
 

 

Friday, April 22, 2011

ఖర నామాబ్దమున నొప్పు గాడిద పూజల్!!!

వర కట్నము గోరెడు నవ
వరులకు , చెడు పాలకులకు,వాచాలురకున్ ,
జరుపవలె జనులు మెచ్చగ
ఖర నామాబ్దమున నొప్పు గాడిద పూజల్!!! 
(శంకరాభరణం  బ్లాగు లో04-04 -2011 నాటి  సమస్యా పూరణ-276లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   
 

  

మకరము పట్టంగ నాకు మరులు గలిగెరా!

సకలము నీవే ననె, నా
ముకుళితమౌ మోముగాంచి, ముదమున ప్రేమన్
బ్రకటించ,మనోహరు ,వా
మ,కరము పట్టంగ నాకు మరులు గలిగెరా! 
(శంకరాభరణం  బ్లాగు లో02-04 -2011 నాటి  సమస్యా పూరణ-274లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   
 

 

Thursday, April 21, 2011

కవులు నియమములకు కట్టు బడరు!

పక్షి యెగుర నెవడు బరిమితులను బెట్టు,
కోకి లేల మాను కూత బెట్ట,
గాలి, నీరు, సూర్య కాంతుల రీతిగా
కవులు నియమములకు కట్టు బడరు! 
(శంకరాభరణం  బ్లాగు లో01-04 -2011 నాటి  సమస్యా పూరణ-273లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   
 

 

Wednesday, April 20, 2011

చదువు కొండక్కినది కళా శాలలందు!

మంత్రి వర్యుల హామీలు మట్టి గరువ,
తోటి మిత్రుల ప్రాణాలు నీట గలువ,
బ్రతుకు పోరులో కలలన్ని బండలవగ,
చదువు కొండక్కినది కళా శాలలందు! 
(శంకరాభరణం  బ్లాగు లో30-03 -2011 నాటి  సమస్యా పూరణ-271లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   
 

 

Tuesday, April 19, 2011

కవినాశము గోరె దన సుకావ్యములోనన్!

కవి వ్రాసెను భారతమును,
భువిలో ధర్మము నిలుపగ, పోరాడిన కౌ
రవులు బరమ దురితులు,గను
క, వినాశము గోరె దన సుకావ్యములోనన్! 
(శంకరాభరణం  బ్లాగు లో29-03 -2011 నాటి  సమస్యా పూరణ-270లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   
 

Monday, April 18, 2011

పువ్వు బోడుల తలలెల్ల బోడు లయ్యె!!

కడలి పొంగెను, భూకంప కంపములకు,
ముంచెను జపానును ,సునామి; మునిగి నారు
సతుల పతులు, సుత సుతులు ,సహచరులును,
పువ్వు బోడుల తలలెల్ల బోడు లయ్యె!! 
(శంకరాభరణం  బ్లాగు లో28-03 -2011 నాటి  సమస్యా పూరణ-269లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   

Sunday, April 17, 2011

ప్రొద్దు పొడిచె, నింక నిద్దురింతు !

రేయి గడిచి పోయె రేరాజు ముద్దాడ
కలువ మురిసి విరిసె కొలను సాక్షి !
కమల ముద్దు మోము కమలేశు ముద్దాడ
ప్రొద్దు పొడిచె, నింక నిద్దురింతు !
రాత్రి వేళ రక్కె రాకాసి దోమలు
నైటు గార్డు డ్యూ టి నరక మయ్యె
పొట్ట కూటి కొఱకు పుట్టెడు బాధలు
ప్రొద్దు పొడిచె, నింక నిద్దురింతు ! 
(శంకరాభరణం  బ్లాగు లో27-03 -2011 నాటి  సమస్యా పూరణ-268లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )  

ఆంజనేయున కొప్పెను హస్తి ముఖము !

పాండు గన్పడె శ్రీ కంఠు పాత్రయందు,
గిరిజ వేషమ్ము నందున మెరిసె వనజ,
పొట్ట గుట్టగా బెంచిన,పొట్టిగుండు
ఆంజనేయున కొప్పెను హస్తి ముఖము !

( స్కూల్ డే సందర్భంగా విద్యార్థులు పలు పౌరాణిక పాత్రలు ధరించగా వారిలో కొందరు పై విధంగా కన్పించారని ఊహ!)
(శంకరాభరణం  బ్లాగు లో26-03 -2011 నాటి  సమస్యా పూరణ-267లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
        

Saturday, April 16, 2011

భల్లూకము చదువు కొనగ బడిలో చేరెన్!

చెల్లించిరి పలు బిల్లులు
పిల్లల తరగతి గదులకు ,పేరుకు ,గనియెన్
బల్లలు తలుపులు లేవని
భల్లూకము చదువు కొనగ బడిలో చేరెన్! 
(శంకరాభరణం  బ్లాగు లో25-03 -2011 నాటి  సమస్యా పూరణ-266లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
        

Friday, April 15, 2011

మందు జనుల కెల్ల విందు గాదె?

వీరు,సచిను,హరి,జహీరుడు,యువరాజు,
గౌతముండు ,ధోని ఘనత మీర
కాంతు లీను విశ్వ కప్పు గెలువ,దేశ
మందు జనుల కెల్ల విందు గాదె? 
(శంకరాభరణం  బ్లాగు లో24-03 -2011 నాటి  సమస్యా పూరణ-265లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
       

Wednesday, April 13, 2011

శ్రీరాముని జూసి ! సీత చీకొట్టె గదా

మారీచుడయ్యె   లేడిగ
శ్రీరాముని జూసి ! సీత చీకొట్టె గదా
యారావణుమోహముగని,
శ్రీ రామాయణముజూడ సీతా వ్యధయే!
(శంకరాభరణం  బ్లాగు లో23-03 -2011 నాటి  సమస్యా పూరణ-264లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
      

Tuesday, April 12, 2011

నరసింహుని ! పూజచేసె నరకాసురుడే

పరికించెనేమొ? హరిలో
నరసింహుని ! పూజచేసె నరకాసురుడే
గిరిజావరు మ్రొక్కి, హరిని
బరిమార్చగ నెంచి ,తుదకు బ్రాణము విడిచెన్!
(శంకరాభరణం  బ్లాగు లో22-03 -2011 నాటి  సమస్యా పూరణ-263లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
      

Monday, April 11, 2011

పోలేరమ్మను నుతింప ముప్పు గలుగురా!

కాలే కడుపులు నింపని
మేలేమియు జేయ లేని, మెప్పుల గను నా
యేలికల నేమి జేయని
పోలేరమ్మను నుతింప ముప్పు గలుగురా!
(శంకరాభరణం  బ్లాగు లో21-03 -2011 నాటి  సమస్యా పూరణ-262లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
     

Sunday, April 10, 2011

వన్నెలే తెల్ల బోయిన భంగి గనిరి !

నిన్న ,గగనాన వెలసిన వెన్నలయ్య
వెలుగు దోసిళ్ళతో నింపె విశ్వమంత!
వర్ణ శోభిత మైనభూ పర్ణ శాల
వన్నెలే తెల్ల బోయిన భంగి గనిరి ! 

వన్నె చిన్నెల కన్నె ,శూర్పనఖ రాము 
వలిచి మోహించి వచ్చెను  వగల నొలికి,
సీత పతియైన శ్రీరాము నీతి ముందు
వన్నెలే తెల్ల బోయిన భంగిఁ గనుఁడు!!
(శంకరాభరణం  బ్లాగు లో20-03 -2011 నాటి  సమస్యా పూరణ-261లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
     

Saturday, April 9, 2011

తిరుమలేశుని దిట్టిన సిరులు గలుగు!

ముడుపు గట్టితి,మ్రొక్కితి ,కడుయిడుముల
కోర్చి కొండ నెక్కితి ,కోర్కె గోరితి,పలు
రీతుల గొలిచితి,నికనే రీతి నిపుడు
తిరుమలేశుని దిట్టిన సిరులు గలుగు? 
(శంకరాభరణం  బ్లాగు లో19-03 -2011 నాటి  సమస్యా పూరణ-260లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
     

Friday, April 8, 2011

సింహము " నెదిరించి గ్రామ సింహము గెలిచెన్!

సింహుని జీల్చిన ఘన నర
సింహుని నామమ్ము బెట్టె ,చిరుతనయునికిన్ ,
సింహుం డెట్లౌ ? తన "నర
సింహము " నెదిరించి గ్రామ సింహము గెలిచెన్! 
(శంకరాభరణం  బ్లాగు లో18-03 -2011 నాటి  సమస్యా పూరణ-259లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
    

Thursday, April 7, 2011

మాధవుడు మాధవుని తోడ మత్సరించె !

పరశు రాముడు ,రాముడు నరయ నొకరు
గాదె !మాధవాంశ లువారు ,కార్య రథులు.
పాపులను ద్రుంచి సుజనుల ప్రభను బెంచ
మాధవుడు మాధవుని తోడ మత్సరించె ! 
(శంకరాభరణం  బ్లాగు లో17-03 -2011 నాటి  సమస్యా పూరణ-258లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
   

నెల వంకన్ జూసి నవ్వ - నేరము సుమ్మీ !

తలవంపులు దెచ్చు పనుల,
కలహంసలు మెచ్చనట్టి కఱకఱి చేష్టల్
వలదన్నజేసి ,చవితిన
నెలవంకన్ జూసి నవ్వ ,నేరము సుమ్మీ! 

జలకా లాడుచు,బీచిన
మలయపు తెమ్మెరలు వీచ ,మధురోహలతో
మొలపోగులేని ,పలు క
న్నెల వంకన్ జూసి నవ్వ నేరము సుమ్మీ!  
(శంకరాభరణం  బ్లాగు లో16-03 -2011 నాటి  సమస్యా పూరణ-257లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
   

Wednesday, April 6, 2011

అర్జునునకు, మిత్రుఁ, డంగ, రాజు!!

బాల క్రిష్ణ,కృష్ణ పరమాత్మ పాత్ర ,నా
గార్జునునకు మిత్రుడంగరాజు
పాత్ర ,భీమసేను పాత్ర శ్రీహరికి ,రా
రాజు పాత్ర చిన్న రామ రావు!
(శంకరాభరణం  బ్లాగు లో14-03 -2011 నాటి  సమస్యా పూరణ-255లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
   

Tuesday, April 5, 2011

శ్రమమునందు మనకు శాంతి దొరుకు!

తనయు డుండు చోటు తమకు తగని దాయె !
కోడ లమ్మ కేమొ కొలువు లాయె!
రమ్మనంగ చావు రాదాయె!పెద్దలా
శ్రమమునందు మనకు శాంతి దొరుకు! 
(శంకరాభరణం  బ్లాగు లో15-03 -2011 నాటి  సమస్యా పూరణ-256లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
  

నాకు మోదమ్ము గూర్చు సునామి యిపుడు

నాకు మోదమ్ము గూర్చు సునామి యిపుడు
వచ్చి ముంచగా నవినీతి వారసులను
నిర్ణయమ్ముల జేయని నిర్దయులను
ప్రజల నిత్యము వంచించు పాలకులను
నోరు దెరవని నాయక భీరువులను
మాట దప్పిన మతిహీన మంత్రి వరుల
కొంగు చాటున జేరిన కుటిల మతుల
రైతు భూముల బలిగొన్న రాక్షసులను!!!!!
(శంకరాభరణం  బ్లాగు లో12-03 -2011 నాటి  సమస్యా పూరణ-253లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
 

Monday, April 4, 2011

స్పురణ భవత్స్వ రూప మను సూక్తి నిజమ్ము ధరిత్రి శారదా!

శ్రీ ఖర నామ  సంవత్సర  ఉగాది శుభాకాంక్షలు 

అరువది నాల్గు విద్దెలకునమ్మయె ముద్దుల బల్కు రాణి ,శ్రీ
కరముల నిచ్చు నక్షరపు కమ్మని నాకృతి ,వేద రూపిణీ !
వరముల నిచ్చి పామరుని పండితు జేసిన వాణి, సద్గుణ
స్పురణ భవత్స్వ రూప మను సూక్తి నిజమ్ము ధరిత్రి శారదా! 
 (శంకరాభరణం  బ్లాగు లో07-03 -2011 నాటి వారాంతపు  సమస్యా పూరణలోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. ) 
  

ధనమె లక్ష్య మగును తాపసులకు !

విద్య లక్ష్య మెపుడు వినయంబు గావలె,
భక్తి లక్ష్య మరయ ముక్తి గాదె !
దాత లక్ష్య మెల్ల దానంబు,తత్వబో
ధనమె లక్ష్య మగును తాపసులకు !

పిసినారులకును,మదిరా
వ్యసనులకెప్పుడును "ధనమె లక్ష్య మగును! తా
పసులకు" లక్ష్యము గావలె
వసుదేవాత్మజుని గొల్చి వరముల బొందన్!
(శంకరాభరణం  బ్లాగు లో13-03 -2011 నాటి  సమస్యా పూరణ-254లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
 

Sunday, April 3, 2011

విస్కీ" యే మేలు , విషము విఱుగుట కొఱకున్ !

మస్కా గొట్టగ వచ్చు,పు
రస్కారము కేలనుండు , రాణింపులు,బో
కు, స్కాముల దారిన , "నో (no)
విస్కీ" యే మేలు , విషము విఱుగుట కొఱకున్ ! 
(శంకరాభరణం  బ్లాగు లో11-03 -2011 నాటి  సమస్యా పూరణ-251లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
 

Saturday, April 2, 2011

భారత జట్టుకు శుభాకాంక్షలు .విజయం వరించుగాక!!!

భారత జట్టుకు శుభాకాంక్షలు .విజయం వరించుగాక!!! 

విజయమ్ గోరిరి, వాంఖడే సమరమున్ వీక్షించు  వారందరున్,
నిజమే గావలె వారికోరికలు పోనీయొద్దు యీ "కప్పు",యా 
రజనీ కాంతుడు మెచ్చగా ,రమణు లున్ రాగాలు వొల్కించ గా,
విజయేoదిందిర భారతా వనిని దీవించంగ, యీ పొద్దునన్!!!      

"కోటి విద్య లెల్ల కూటికేననుమాట"

"కోటి విద్య లెల్ల కూటికేననుమాట"
వెన్నుదట్ట,ఉన్న కన్ను మూసి
కారు నడుపు నేర్పు గని మెచ్చిరి,జన
మెల్ల ! కన్ను వలన మేలు గలిగె !

(ఒకే ఒక కన్ను గలిగి ,పొట్ట కోసం ,ఉన్న కన్నుకు గంతలు కట్టు కొని కారు నడిపే విద్య నేర్చి జనుల రంజింప జేస్తూ జీవితం గడుపుచున్నాడనే భావంతో పూరించాను)
(శంకరాభరణం  బ్లాగు లో10-03 -2011 నాటి  సమస్యా పూరణ-250లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
  

Friday, April 1, 2011

హర హర శంకరా యనుచు నాలిని గౌగిట జేర్చె ప్రేమతో !!!

పురహరు గొల్చి దంపతులు బుణ్యము బొందగ నేగ కాశికిన్
తరుణిరొ దప్పె దారి ,పెను దాపము జెందె నతండు ,నశ్రువుల్
దొరెలెను నేకధాటిగను,దోయిలిబట్టి నుతింప, గన్పడన్
హర హర శంకరా యనుచు నాలిని గౌగిట జేర్చె ప్రేమతో !!! 
(శంకరాభరణం  బ్లాగు లో02-03 -2011 నాటి వారాంతపు  సమస్యా పూరణలోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. ) 

  

దున్న, పాలు పితికె సన్నుతాంగి!

మామ గుడికి వెళ్లె, మనుమన్ని నానమ్మ
ముద్దు జేసి ముడ్డి ,మూతి కడిగె,
మరిది బడికి నడిచె,మగడు వెడలె మడి
దున్న, పాలు పితికె సన్నుతాంగి! 
(శంకరాభరణం  బ్లాగు లో09-03 -2011 నాటి  సమస్యా పూరణ-249లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )