Tuesday, May 31, 2011

గుఱ్ఱానికి నైదు;కాళ్ళు కోడికి వలెనే!!!

గుఱ్ఱము ఆచూకిని గొర్రెల గాచే కుర్రానితో నడుగు చున్నాడు యజమాని.

ఎఱ్ఱని చాఱిక లుండెను
గుఱ్ఱానికి నైదు;కాళ్ళు కోడికి వలెనే
కఱ్ఱను చెక్కిన  చందము
కుఱ్ఱడ గనినావ? దాని , గొఱ్రెల చెంతన్ !
(శంకరాభరణం  బ్లాగు లో20-05-2011 నాటి  చమత్కార  పద్యాలు -58 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
 

Monday, May 30, 2011

సంపాదన లేని పతిని సతి మెచ్చుకొనెన్ !

ఇంపైన వాడు ,సరిపడు
సంపాదన గల్గినట్టి సచ్చీలుండున్,
కొంపల గూల్చే పాపపు
సంపాదన లేని పతిని సతి మెచ్చుకొనెన్ ! 
(శంకరాభరణం  బ్లాగు లో19-05-2011 నాటి  సమస్యా పూరణ-342లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
 

Sunday, May 29, 2011

కలిమిఁ గలిగించు కలకంఠి కంటినీరు!!!.

చిత్ర సీమలో జరిగె విచిత్రములును
నాటి లవకుశ నిర్మాత మేటి గాను
కాసు లార్జించె సీతమ్మ కనులు జెదర
కలిమిఁ గలిగించు కలకంఠి కంటినీరు!!! 
(శంకరాభరణం  బ్లాగు లో18-05-2011 నాటి  సమస్యా పూరణ-341లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
 

Saturday, May 28, 2011

వంక బెట్టఁదగును శంకరునకు !

విష్ణు పత్ని బొమ్మ విష్ణువక్షమ్ముపై ,
వనజ భవుని చెంత వాణి బొమ్మ,
పార్వతమ్మ బొమ్మ భక్తిమీరనెడమ
వంక బెట్టఁదగును శంకరునకు ! 
(శంకరాభరణం  బ్లాగు లో17-05-2011 నాటి  సమస్యా పూరణ-340లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
 
   

Thursday, May 26, 2011

కవిని పెండ్లి యాడి కాంత వగచె !!!

కలము కంట బడగ ,కరము విడిచి బెట్టు ,
కాన రాని కలికి కనులు మెచ్చు ,
రాత్రి పూట గూడ రాముణ్ణి వర్ణించు
కవిని పెండ్లి యాడి కాంత వగచె  !!! 
(శంకరాభరణం  బ్లాగు లో16-05-2011 నాటి  సమస్యా పూరణ-339లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
 
   
 


Wednesday, May 25, 2011

దేశము మాకు వద్దనెడి తెంపరులే మన జాతి రత్నముల్!!!.

దేశము మట్టిగాదుగన, దేశము మానవ శక్తియే గనన్,
దేశము నందు భక్తియును దేశము నందనురక్తి బెంచు , సం
దేశము నిచ్చు నేతలును, దేశపు పాలనలో విదేశి యా
దేశము మాకు వద్దనెడి తెంపరులే మన జాతి రత్నముల్!!!. 
(శంకరాభరణం  బ్లాగు లో15-05-2011 నాటి  సమస్యా పూరణ-338లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
 

   
 

Saturday, May 21, 2011

విద్య యొసఁగునే వినయంబు వెఱ్ఱి గాక!

సత్య సారమ్ము దెల్పెడు శాస్త్ర మేది,
ధర్మ మార్గమ్ము జూ పెట్ట దలుచు నెవడు,
నీతి నియమాలు నిశిలోన నీల్గ, నేటి
విద్య యొసఁగునే వినయంబు వెఱ్ఱి గాక! 
(శంకరాభరణం  బ్లాగు లో15-05-2011 నాటి  సమస్యా పూరణ-337లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
 

   

Friday, May 20, 2011

దత్తపది - లాడెన్, ఊడెన్, వీడెన్, వాడెన్



"లాడెన్, ఊడెన్, వీడెన్, వాడెన్"
పై పదాలను ఉపయోగించి
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ స్థితిగతులపై
 నచ్చిన ఛందస్సులో పద్యం
శ్రీ చిరంజీవిగారి రాజకీయ ప్రస్థానం.

పదునైన మాట లాడెన్,
పదవిని యాశించి నాడు,పరపతి యూడెన్,
బెదిరెను, విలువలు వీడెన్
వదనము వాడెన్,చివరకు వార్ధిన గలిసెన్!
(శంకరాభరణం  బ్లాగు లో11-05-2011 నాటి  దత్తపది 13 కి పద్య రూపం  .తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
 
  

గుండె గుండెలో నిండుగా గుప్తముగను,

ఉండె నున్నాడు నుండును నుర్వి యందు
గుండె గుండెలో నిండుగా గుప్తముగను,
లేడు లేడులే దేవుండు లేడ టన్న
నాస్తికులకు దేవతలన్న నయము భయము. 
(శంకరాభరణం  బ్లాగు లో12-05-2011 నాటి  సమస్యా పూరణ-335లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
 

  

Thursday, May 19, 2011

యతి మోహావేశమెసగ ,నతివను బిలిచెన్!

గతిచెడె  సుభద్ర ,కుంతీ
సుతురూపముజూడగోరి,సుందరి వేడెన్ ,
నతనికి జతగలిపెదనని
యతి మోహావేశమెసగ ,నతివను బిలిచెన్! 
(శంకరాభరణం  బ్లాగు లో10-05-2011 నాటి  సమస్యా పూరణ-334లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
 

 

Wednesday, May 18, 2011

కనక దుర్గ యిచ్చు గష్ట ములను!!!

కల్తి సరకులమ్ము కపటవర్తకులకు ,
దుష్ట వర్తనులకు,ధూర్తు లకును ,
కౄర,చోర, జార కుటిల చిత్తులకెల్ల
కనక దుర్గ యిచ్చు గష్ట ములను!!! 
(శంకరాభరణం  బ్లాగు లో08-05-2011 నాటి  సమస్యా పూరణ-332లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
 

 

Tuesday, May 17, 2011

ఓటుకు నోట్లిచ్చు వారె యుత్తమ నేతల్ !

నోటున కున్న ట్టి విలువ
మాటకు లేకుండబోయె,మన దేశములో
పోటీలోయెవరున్నను,
ఓటుకు నోట్లిచ్చు వారె యుత్తమ నేతల్ ! 
(శంకరాభరణం  బ్లాగు లో07-05-2011 నాటి  సమస్యా పూరణ-331లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
 

 

Monday, May 16, 2011

దత్త పది - విల్, పిల్, కిల్, మిల్

దత్త పది - విల్, పిల్, కిల్, మిల్


విల్, పిల్, కిల్, మిల్
పై పదాలను ఉపయోగించి  నచ్చిన ఛందస్సులో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్స వము
విలు ద్రుంచిన రఘు రాముని
పిలిపించిన మునుల సాక్షి, పెద్దల సాక్షిన్ ,
కిలకిల పల్కుల సీతకు
మిలమిల మెరియంగ పెండ్లి మిథిలను జరిగెన్ !

ఎన్నికలనఁగ రోతాయె, నేమి కర్మ!

తడవ తడవకో యెన్నిక దప్ప దాయె!
కడప గడపన సర్కారు గన్నులాయె!
బరిన నిల్చిన వారుసంపన్నులాయె!
ఎన్నికలనఁగ రోతాయె, నేమి కర్మ! 
(శంకరాభరణం  బ్లాగు లో06-05-2011 నాటి  సమస్యా పూరణ-330లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
 

Sunday, May 15, 2011

దత్త పది - సిరి

దత్త పది -  (సిరి)



"సిరి" అనే పదాన్ని
"లక్ష్మి" అనే అర్థంలో ప్రయోగించకుండా
నాలుగు పాదాలలో వేసి
శ్రీదేవిని ప్రార్థిస్తూ
పద్యం
చూసిరి శ్రీదేవిని, యర
మూసిరి గన్నులు ,మనములు ముదమున బొంగన్!
పూసిరి పలు గంధమ్ముల
వేసిరి మందార మాల ,వేడుక తీరన్   !

Saturday, May 14, 2011

వేప చెట్టున గాసెను - వెలగ పండ్లు!!!

ప్రఖ్యాత ఐంద్ర జాలికుడు తన ప్రదర్శనలో

చిట్టి తొట్టిలో విత్తును బెట్టినాడు ,
ఎరువు వేసెను ,పోసినా డెఱ్ఱనీరు,
మంత్ర దండమ్ము దిప్పెను మాయ జేసి
వేప చెట్టున గాసెను - వెలగ పండ్లు!!! 

విష్ణు కీర్తిని ,మూర్తిని ,విశ్వ మయుని
దుష్ట కశిపుండు దిట్టెను దిక్కులదర
యట్టి వానికి ప్రహ్లాదు బుట్టె గాదె!
వేప చెట్టున గాసెను వెలగ పండ్లు/పండు!  
(శంకరాభరణం  బ్లాగు లో05-05-2011 నాటి  సమస్యా పూరణ-329లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    

Thursday, May 12, 2011

గర్భ మందు బిడ్డ గంతు లిడెను!!!

"బుర్ర " గుహలనుగన,బోయిరి దంపతు
లిరువురు,తమ సుతుడు డిష్ట పడగ  
విస్మయమ్ముగల్గె,వింతలన్గనిన,భూ
గర్భ మందు బిడ్డ గంతు లిడెను!!! 
(శంకరాభరణం  బ్లాగు లో04-05-2011 నాటి  సమస్యా పూరణ-328లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    

Wednesday, May 11, 2011

రణమె, మనల కిఁక శరణము గాదె!.

భూము లున్న వనిరి, భూరిగా యిచ్చోట
గ్రామ మందు జూడ గాన రావు,
తాత లేక పాయె ,దండ్రియుo బోయె,క
రణమె మనల కిఁక శరణము గాదె!.


పూరణములు చేయ బోవంగ నిత్యమ్ము,
శంకలు పలుగలుగు సత్యముగను,
శారదాంబ కరుణ, సద్గురువుల వ్యాక
రణమె, మనల కిఁక శరణము గాదె!.

పూరణములు చేయ పూర్వుల కావ్యాలు
పుజ్యు లైన కవుల పూరణాలు
సాధనాలు గావె, శంకర బ్లాగావ
రణమె, మనల కిఁక శరణము గాదె!. 
(శంకరాభరణం  బ్లాగు లో03-05-2011 నాటి  సమస్యా పూరణ-327లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   

అతి, గతి, చితి, పతి.

దత్త పది -  (అతి, గతి, చితి, పతి)


అతి, గతి, చితి, పతి.
పై పదాలను ఉపయోగించి నచ్చిన ఛందస్సులో  పద్యం.
అతిగ తినగ రాదు,నాడితప్పగ రాదు,
ప్రజల ముంచి తిరుగ పాడిగాదు,
దేశ పరువు నిలుప తిరుపమెత్తగరాదు,
ఓటు నమ్మ రాదు నోటు కొఱకు! 

"నరసింహుండాగ్రహించి నరకుని జంపెన్"

పరికించిరి వాక్యమ్మును,
"నరసింహుండాగ్రహించి నరకుని జంపెన్"
సరియైన పదము కాదని
చిరు నగవు లొలుక పలికిరి చిరు విద్యార్థుల్!
(శంకరాభరణం  బ్లాగు లో02-05-2011 నాటి  సమస్యా పూరణ-326లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   

Tuesday, May 10, 2011

రామ మూర్తి గన విరక్తి గలిగె!

ధర్మ మూర్తి యేల దయలేని రాజాయె?
ధరణి జాత యెట్టి తప్పు జేసె ?
గర్భవతిని సతిని గానల బోద్రోలు,
రామ మూర్తి గన విరక్తి గలిగె! 
(శంకరాభరణం  బ్లాగు లో01-05-2011 నాటి  సమస్యా పూరణ-324లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   


Monday, May 9, 2011

కుల కాంతలేడ్చు కాలము వచ్చున్!

దత్తపది
"కల" అనే పదాన్ని
"స్వప్నం" అనే అర్థంలో ప్రయోగించకుండా
నాలుగు పాదాలలో
త్రిజటాస్వప్న వృత్తాంతము .
కలవరపడ బోకు,లలన
కలతలు నీకున్ తొలుగును, కలకలముల్ లం
కల బుట్టున్ పలు, కాలు స
కలమును,కుల కాంతలేడ్చు కాలము వచ్చున్!

Sunday, May 8, 2011

అమ్మ వదన మందె నన్నియు దాగుండు !!!

ప్రేమకర్థ మేమి ? ప్రేమకు  రంగేది?
రూప మేది దాని రుచియు నేది?
అమ్మ వదన మందు నన్నియు దాగుండు !!!
మంద వారి మాట మణుల మూట!

కప్పు దినెడు పాము కసవు మెసగె !

రోజు కొక్క ప్రాణి మోజుగా లాగించి   ,
భయము కలుగ జేసి, బకుడు నాడు.
భీమ సేను డతని భీకరంబుగజంపె   ,
కప్పు దినెడు పాము కసవు మెసగె ! 
(శంకరాభరణం  బ్లాగు లో28-04 -2011 నాటి  సమస్యా పూరణ-322లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   


చీర విడిచి వెడలె - జిగురుఁబోఁడి!

సెల్లు చెవిన బెట్టి, చీర పాకె ట్లతో
నతివ బస్సు నెక్కె, నాత్ర మునను,
భాగ్య నగర మందు బస్సులో సీటుపై
చీర విడిచి వెడలె - జిగురుఁబోఁడి! 
(శంకరాభరణం  బ్లాగు లో29-04 -2011 నాటి  సమస్యా పూరణ-323లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   


Saturday, May 7, 2011

ఆవకాయ రుచుల నతివ రోసె!!!,

ఐసు క్రీము దినగ నలవాటు పడెనేమొ,
నావకాయ రుచుల నతివ రోసె,
ఆంధ్ర నావ కాయ నవనిలో మేటిరా,
దాని దినిన జన్మ ధన్య మగును !
(శంకరాభరణం  బ్లాగు లో27-04 -2011 నాటి  సమస్యా పూరణ-321లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   


Friday, May 6, 2011

బాబాయే భార్య తోడ భజనకు వెడెలెన్!!!

బాబా గుడికిన్ రజనీ
బాబాయే భార్య తోడ భజనకు వెడెలెన్,
రాబోవు కాలమందున
బాబా మార్గమె జనులకు భాగ్యము గూర్చున్!
(శంకరాభరణం  బ్లాగు లో26-04 -2011 నాటి  సమస్యా పూరణ-320లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   


Thursday, May 5, 2011

సత్య సాయికి సాటియౌ సాధు వెవరు?

నిత్య సేవయే నిజమైన సత్య మనెడు
సత్య సాయికి సాటియౌ సాధు వెవరు?
ప్రేమ పంచగా నేగెనో నమర పురికి,
మరణ మందిన వాడె యమరు డనదగు! 
(శంకరాభరణం  బ్లాగు లో25-04 -2011 నాటి  సమస్యా పూరణ-319లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   


 

Wednesday, May 4, 2011

పూలన్ దేవిని గొలిచినఁ బుణ్యము దక్కున్!

నేలకు,నింగికి,నిప్పుకు,
గాలికి,నీటికిని మూడు కాలమ్ములకున్
లీలా రూపము, గూర్చుము
పూలన్;!దేవిని గొలిచినఁ బుణ్యము దక్కున్! 
(శంకరాభరణం  బ్లాగు లో24-04 -2011 నాటి  సమస్యా పూరణ-317లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   


 

Tuesday, May 3, 2011

చైత్రపు శోభలం గన నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్ !!!

గాత్రము లెండు  టాయె ,మరి గానగ రాదొక నీటి చుక్కయున్,
నేత్రము మండుటాయె మరి , నేరుగ జూడగ ఎండలాయె, వై
చిత్రమదేమిటో ,వరుస చిత్రము లన్నియు తేలిపోయె ,నీ
చైత్రపు శోభలం గన నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్!!!
(శంకరాభరణం  బ్లాగు లో17-04 -2011 నాటి వారాంతపు  సమస్యా పూరణలోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. ) 

  

నీటి లోన బుట్టె నిప్పు గనుడు!!!

అంధ రాజు సాక్షి గాంధారి పుత్రుండు
వంద నీయు రాలి వలువ లొలువ
ధర్మమడిగె నాడు ద్రౌపది !నామెక
న్నీటి లోన బుట్టె నిప్పు గనుడు!!!
(శంకరాభరణం  బ్లాగు లో22-04 -2011 నాటి  సమస్యా పూరణ-293లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   


 

Monday, May 2, 2011

పిట్ట పిట్ట పోరు పిల్లి దీర్చె!

గుట్ట గుట్ట పోరు గుత్తెదారుడు దీర్చె,
గుడిసె గుడిసె పోరు రోడు దీర్చె
పార్టి పార్టి పోరు ప్రజలు తీర్చినయట్లు,
పిట్ట పిట్ట పోరు పిల్లి దీర్చె! 
(శంకరాభరణం  బ్లాగు లో20-04 -2011 నాటి  సమస్యా పూరణ-291లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   
 

చందమామఁ గన నసహ్యమయ్యె!

బండి నెక్కి రాడు బంతి పూలు తేడు,
కొండ నుండి తేడు గోగు పూలు ,
తార చుట్టు రోజు తారాడు గగనాన
చందమామఁ గన నసహ్యమయ్యె! 
(శంకరాభరణం  బ్లాగు లో21-04 -2011 నాటి  సమస్యా పూరణ-292లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   
 

 

Sunday, May 1, 2011

కంజ దళాక్షుండు మెచ్చ

అంజన సుతు, సౌమిత్రికి
సంజీవనిఁ దెచ్చి యిచ్చి; చంపగ సాగెన్,
పింజారి మూక నంతను,
కంజ దళాక్షుండు మెచ్చ ,కాలుడు మెచ్చన్!
(శంకరాభరణం  బ్లాగు లో19-04 -2011 నాటి  సమస్యా పూరణ-290లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )