Thursday, July 21, 2011

పుట్టిన దినమున విషాదమున విలపింతున్!

మెట్టిన యింటికి నప్పులు
పుట్టెడు, పట్టదు మగనికి ,పుస్తెలనే తా
కట్టుగ బెట్టిరి కొట్టున
పుట్టిన దినమున విషాదమున విలపింతున్!

(శంకరాభరణం  బ్లాగు లో17-07-2011 నాటి  సమస్యా పూరణ-396లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )  

Wednesday, July 20, 2011

రావణుండు దిక్కు రాఘవునకు!!!

దీనజనుల దిక్కు దేవుండుముక్కంటి,
రక్కసులకు దిక్కు రావణుండు
దిక్కు రాఘవునకు ధీరత్వమేగదా
నీతి దిక్కు జయము నిలుచుగాదె !!!

(శంకరాభరణం  బ్లాగు లో16-07-2011 నాటి  సమస్యా పూరణ-395లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )     

Tuesday, July 19, 2011

ముక్కంటిని మ్రొక్కు వాడు మూర్ఖుడు జగతిన్!!!

ఒక్కండున్నను చాలును
ముక్కంటిని మ్రొక్కు వాడు! మూర్ఖుడు, జగతిన్
చిక్కులు బెట్టెడు వాడును
పెక్కండ్రు oడినను పేడ పిడకలు గావే!!!
(శంకరాభరణం  బ్లాగు లో15-07-2011 నాటి  సమస్యా పూరణ-394లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )     

Monday, July 18, 2011

వ్యాసుని భారతమ్ము విన ,వ్యాధులు బాధలు,వృద్ధి పొందెడిన్!!!

ఆసుర వృత్తి బాపు,మణి హారమె భారత వాఙ్మయంబునన్ ,
బూసిన వేదరాజమిది పూర్వుల బుణ్య తప:ఫలంబునన్ ,
వ్యాసుని భారతమ్ము విన ,వ్యాధులు బాధలు,వృద్ధి పొందెడి
న్మోసములన్నియున్ దొలుగు ,మోదము హెచ్చును మానవాళికిన్!!!


(శంకరాభరణం  బ్లాగు లో14-07-2011 నాటి  సమస్యా పూరణ-393లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )     
 

Saturday, July 16, 2011

సరసు డైనట్టి భోగియే జ్ఞాన యోగి!!!

కామి గానట్టి వారలు కారు,కారు
మోక్ష గాములేనాడును ; మున్ను,నిన్న,
నేడు మరియును రాబోవు నాడు కూడ
సరసు డైనట్టి భోగియే జ్ఞాన యోగి!!! 


(శంకరాభరణం  బ్లాగు లో14-07-2011 నాటి  సమస్యా పూరణ-392లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )     
 

Friday, July 15, 2011

కాముకులను గొలువ గలుగు యశము!

మంత్రి పదవిలో కుతంత్రాలు పన్నెడు
జంత్ర గాళ్ళ బ్రతుకు జైళ్ళ వశము,
చేత లందు మంచి చేవగల్గిన,ధర్మ
కాముకులను గొలువ గలుగు యశము! 

(శంకరాభరణం  బ్లాగు లో13-07-2011 నాటి  సమస్యా పూరణ-391లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )     
 

Thursday, July 14, 2011

అరయంగాద్రుపద సుతకు నార్గురు భర్తల్ !!!

వరసుత,నామాట వినిన
ధరనేలగవచ్చు కుంతిదనయుడవై,దా
మరనేత్రియుబట్టు కరము
నరయంగాద్రుపద సుతకు నార్గురు భర్తల్ !!!

(దాన వీర శూర కర్ణ లో కృష్ణుడు కర్ణునితో తన జన్మ రహస్యమును దెలిపి పాండవ పక్షము వచ్చిన కలుగు సుఖములను గూర్చి చెప్పిన సందర్భము దృష్టిలో బెట్టి చేసిన పూరణ .)

(శంకరాభరణం  బ్లాగు లో10-07-2011 నాటి  సమస్యా పూరణ-388లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )     
 

Wednesday, July 13, 2011

హరికిగీతను బోధించె నర్జునుండు!!!

బంధు జనమునునిర్జించి బొందుసుఖము
శాంతినీయదనుచు సవ్యసాచిదెలుప
హరికి,గీతను బోధించె ; నర్జునుండు
బొందె విజయమ్ము హరిమెచ్చ పోరునందు !!!

(శంకరాభరణం  బ్లాగు లో07-07-2011 నాటి  సమస్యా పూరణ-385లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )     
 

Tuesday, July 12, 2011

రాజీనామాల జాతరలకు దెర లేచెన్ !

మాజీ లైనను చాలును,
రాజీ యికపడగబోము, రాష్ట్రమ్మిక మీ
చేజారునుననుచు బల్కిరి
రాజీనామాల జాతరలకు దెర లేచెన్ ! 
(శంకరాభరణం  బ్లాగు లో06-07-2011 నాటి  సమస్యా పూరణ-384లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )     
 

Monday, July 11, 2011

లోకపాలు లేకున్నను లోటులేదు !!!

విశ్వ సంక్షేమమును గోరు విబుధులకును,
దీనజన సేవలోగల ధీయుతులకు,
ప్రజల కాంక్షల నెరవేర్చు పాలకులకు
లోకపాలు లేకున్నను లోటులేదు!!!

(శంకరాభరణం  బ్లాగు లో05-07-2011 నాటి  సమస్యా పూరణ-383లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )     
 

Sunday, July 10, 2011

కరుణానిధి కూతురునకుగల్మషమంటెన్ !!! .

గురుబలము జాలలేదో
మరుగునబడిపోవుననుచు మదిననుకొనెనో
చెరిగెను నగవులు మొగమున
కరుణానిధి కూతురునకుగల్మషమంటెన్ !!! . 
(శంకరాభరణం  బ్లాగు లో04-07-2011 నాటి  సమస్యా పూరణ-382లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )     
 

Saturday, July 9, 2011

రావణున కంజలించెను రామపత్ని.

కతనమేదైనగానిమ్ము, కపట వేష
ధారియైవచ్చి భిక్షమ్ము గోరినంత ,
మాన్వి,మాననీ యుండని మాయ రూప
రావణున కంజలించెను రామపత్ని. 
(శంకరాభరణం  బ్లాగు లో01-07-2011 నాటి  సమస్యా పూరణ-379లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )     
 

Thursday, July 7, 2011

గాడిద యేడిచె గదన్నఘన సంపన్నా!!!

నాడును, నేడును మరియే
నాడును సోమరులనెల్ల, నలుగురు వినగా
గాడిద లారా యనగా,
గాడిద యేడిచె గదన్నఘన సంపన్నా!!!

(శంకరాభరణం  బ్లాగు లో27-06-2011 చమత్కార పద్యాలు -88     లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Wednesday, July 6, 2011

మీసమ్ములు మొలిచెఁ గనుఁడు మీననయనకున్!!!

గ్రాసము కోసము పలుపలు
మోసమ్ములు జేయలేక  ,మోదముమీరన్
వేసెను మగవేషమ్ములు
మీసమ్ములు మొలిచెఁ గనుఁడు మీననయనకున్!!!
(శంకరాభరణం  బ్లాగు లో28-06-2011 నాటి  సమస్యా పూరణ-376లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )     
 

Tuesday, July 5, 2011

సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్ !!!

కుగ్రామపు వేడుకలో
నిగ్రహమును వీడి ,మత్తు నెక్కొన  దిఱుగ
న్నుగ్రాకృతిదాల్చి,నుఱికి
సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్ '.
 (శంకరాభరణం  బ్లాగు లో26-06-2011 చమత్కార పద్యాలు -87     లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Friday, July 1, 2011

శంకరునకు గలవు వంకలెన్నొ!!!

సిగన చంద్ర వంక, చిత్తమెడమ వంక ,
గళమున గరళమ్ము కంటమంట,
మెడననాగవంక,నడుచుభక్తులవంక 

శంకరునకు గలవు వంకలెన్నొ




(శంకరాభరణం  బ్లాగు లో27-06-2011 నాటి  సమస్యా పూరణ-375లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )